దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు జక్కన్న దర్శకత్వం వహించిన సినిమాలు ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. అన్ని సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా బాహుబలి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేశారు. బాహుబలి మాదిరిగానే ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అంతటి ఘన విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం భారీ వసూళ్లు కొల్లగొడుతూ రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది.
ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. వీరి నటనతో ప్రేక్షకులను తమవైపు తిప్పుకున్ఆరు. ఆర్ఆర్ఆర్ మేకింగ్‌లో దర్శకుడు రాజమౌళి ఎంతో ఆచితూచి వ్యవహరించారు. విజువల్స్ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. అదేవిధంగా ఈ సినిమాకు మరొక ప్రధాన ఆకర్షణ సంగీతం. ఈ సినిమాలో సంగీత దర్శకుడు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా రాజమౌళి సినిమా అంటే అందులో కీరవాణి మ్యూజిక్ తప్పక ఉంటుంది. ఆయన అన్ని చిత్రాలకు కీరవాణి మ్యూజిక్ అందించడం విశేషం.
Advertisement
Advertisement
ఆర్ఆర్ఆర్ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అదేవిధంగా సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా స్థాయిని పెంచేసింది. ఈ చిత్రం ప్రారంభంలోనే ఓ చిన్న పాప పాటతో ప్రారంభమవుతుంది. కొమ్మ ఉయ్యాల… కోనా జంపాల అనే పాట మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఓ చిన్నారి బ్రిటిషు రాణికి పచ్చబొట్టు వేస్తున్నప్పుడు ఈ పాట పాడుతుంది.. ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ పాటను పాడిన చిన్నారిని కీరవాణి ట్విట్టర్ వేదికగా పరిచయం చేశారు. ఈ పాటను పాడిన చిన్నారి పేరు ప్రకృతి అని.. 2019 మార్చి 15న ఈ పాటను రికార్డు చేసినట్టు వెల్లడించారు. ఈపాటను రికార్డు చేసినప్పుడు ఆ చిన్నారి వయస్సు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే. ప్రకృతి అనే చిన్నారిపై కీరవాణి ప్రశంసల వర్షం కురిపించారు. తను ఎంతో టాలెంటెడ్ కిడ్ అని పేర్కొన్నారు.
Prakruthi was younger by 3 years when she originally dubbed this song ! Such a talented kid 😊 pic.twitter.com/9XH9DTdikX
— mmkeeravaani (@mmkeeravaani) April 4, 2022