దర్శకధీరుడు రాజమౌళి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి రాజమౌళి అసలు ఎక్కడ పుట్టాడు అనే ప్రశ్న చాలా మంది మెదులుతుంది.
Advertisement
వాస్తవానికి రాజమౌళి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతం కావడంతో రాజమౌళి అక్కడే పుట్టి పెరిగాడు అని చాలామంది అనుకుంటారు.
READ ALSO : Shakib Al Hasan : అభిమానిని దారుణంగా కొట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్
Advertisement
అయితే, రాజమౌళిని డైరెక్టర్ గా కాకుండా హీరో చేయాలని అనుకున్నారట. దాని వెనుక ఎం.ఎం.కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఉన్నారట. తాజాగా ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలపై సంచలన సమాధానాలు ఇచ్చారు. తన కుటుంబంలో హీరో అయ్యే అవకాశాలు ఎవరికీ లేవు అని కేవలం ఒక రాజమౌళికి మాత్రమే ఆ లక్షణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. తమ కుటుంబం ఎన్నో వందల ఎకరాలను కేవలం సినిమాల కోసమే అమ్ముకున్నామని చెప్పుకొచ్చారు.
READ ALSO : 12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్
ఇక ఈ మధ్యకాలంలో కీరవాణి కొడుకు హీరో అవ్వాలని ప్రయత్నిస్తున్న అంత సీన్ లేదని తేల్చి పారేశారు. మా కుటుంబంలో రాజమౌళికి తప్ప ఆ అర్హత ఎవరికీ లేదని, కానీ ఎన్నిసార్లు హీరోగా నటించమన్నా కూడా ఒక నవ్వు నవ్వి వెళ్లిపోయేవాడు అంటూ తెలిపారు శివశక్తి దత్తా. ఒకవేళ రాజమౌళి హీరో అయి ఉంటే ఈరోజు దర్శకుడుగా ఉండేవారు కాదని వివరించారు.
READ ALSO : కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !