సాధారణంగా పెళ్లి అంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. అందుకే పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. పెళ్లి అంటే పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పెళ్లి పందిరి ఇలా సంప్రదాయ బద్ధంగా చేసుకుంటారు. అదేవిధంగా ఇంట్లో ఎవరైనా మరణిస్తే వివాహం సంవత్సరం వరకు ఈ కార్యక్రమం నిర్వహించరు. ఇక పెళ్లి అయితే అసలే జరిపించరు. కానీ కొంత మంది కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అనే సామెత అంటుంటారు. ఈ పెళ్లికి ఈ సామెత కరెక్ట్‌గా సూట్ అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పెళ్లి అంటే ఇంట్లో అంతా బంధువులు, స్నేహితులతో సందడిగా ఉంటుంది. కానీ ఓ వ్యక్తి ఇంట్లో తల్లి శవాన్ని పెట్టుకుని దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. అసలు కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఝార్ఖాండ్‌కి చెందిన ఓం కుమార్ కి, సరోజ్ అనే యువతితో కొద్ది రోజుల కిందటే పెళ్లి జరిగించాలని నిశ్చయించారు. వీరి పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే కొద్ది రోజులుగా ఓం కుమార్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది. తన తల్లి చివరి కోరిక ఓం కుమార్ పెళ్లి చేసుకోవడం అయితే ఈ కోరిక తీరకుండానే ఓం కుమార్ తల్లి ఆరోగ్యం విషమించి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన తల్లి యొక్క చివరి కోరికను తీర్చేందుకు ఓం కుమార్ ఏ కొడుకు చేయలేని పని చేశాడు.
Advertisement
తన తల్లి శవాన్ని ఇంట్లో ఉంచి ఓం కుమార్ దగ్గరలోని శివాలయం సరోజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన తరువాత ఓం కుమార్ దంపతులు చనిపోయిన తల్లి కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక ఆ తరువాత తల్లి అంత్యక్రియలను పూర్తి చేశాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న వారినందరినీ కలచివేసింది. తన తల్లి కోరినకు ఈ విధంగానైనా తీర్చుకున్నాడని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఓం కుమార్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.
Also Read :
తనను అమ్మోదంటూ యజమానిపై పడి ఏడ్చిన మేక.. వీడియో వైరల్..!!