Home » సూపర్ స్టార్ కృష్ణ అన్నంత పని చేసారు.. కేసీఆర్ రెండు చోట్లే.. ఎన్టీఆర్ మాత్రం మూడుచోట్ల…!

సూపర్ స్టార్ కృష్ణ అన్నంత పని చేసారు.. కేసీఆర్ రెండు చోట్లే.. ఎన్టీఆర్ మాత్రం మూడుచోట్ల…!

by Sravya
Ad

సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఒక పక్క సినిమాల్లో, ఇంకొక రాజకీయాల్లో కూడా అద్భుతంగా రాణించారు. ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలని సినిమాలతో గెలుచుకున్నారు అలానే ఆయన నాయకత్వం ద్వారా కూడా చాలామందిని గెలుచుకున్నారు. ఎంతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్. అయితే గురువు ఎన్టీఆర్ చేయని పనిని శిష్యుడు చేశారు. కెసిఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. మరి రెండు చోట్ల పోటీ చేయడం వలన కేసీఆర్ గెలుస్తారా గెలవరా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. ఎన్టీఆర్ ఒకటి కంటే ఎక్కువ చోట్ల పోటీ చేస్తే ఏమైంది..? గతంలో ఏం జరిగింది..? అనేది ఇప్పుడు చూద్దాం.

ntr-TDP

Advertisement

Advertisement

ఎన్టీఆర్ గారు ఏకంగా మూడు అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడం జరిగింది ఎన్టీఆర్ మొదట గుడివాడ, తిరుపతిలో పోటీ చేశారు. 1983లో ఎన్టీఆర్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ 1985లో ఎన్టీఆర్ ఏకంగా మూడు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. నల్గొండ, హిందూపురం, గుడివాడ నుండి అయిన పోటీ చేశారు అయితే సినిమా తరపు నుండి ఎన్టీఆర్ ఉన్నారు.

కాబట్టి సినిమా తరపు వాళ్లే ఆయనకి పోటీగా ఉండాలని గుడివాడ నుండి పోటీకి కృష్ణ గారు సినిమా వాళ్లకి సంబంధించిన వాళ్ళని తీసుకురావాలని అనుకున్నారు. సినిమా నుండి నిర్మాత అయిన సూర్యనారాయణ రావు ని పోటీగా నిలబెట్టారు. ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ గారికి మద్దతుగా ఉన్న సినిమా వాళ్లు కూడా అక్కడికి వచ్చారు కానీ మూడు చోట్ల నుండి కూడా ఎన్టీఆర్ గెలిచారు అయితే ఎన్టీఆర్ మూడు చోట్ల అప్పట్లో పోటీ చేశారు. ఇప్పుడు కెసిఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. మరి ఎందుకు రెండు చోట్ల పోటీ చేస్తున్నారనేది తెలీదు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading