తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ అయిన నాకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని కనీస ప్రోటోకాల్ కూడా పాటించడంలేదని తమిళ సై సౌందరరాజన్ అన్నారు. ఈ మధ్యకాలంలో గవర్నర్ కు మరియు ప్రభుత్వానికి మధ్య చాలా గ్యాప్ వస్తుంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ వ్యవస్థపై సంచలన కామెంట్స్ చేశారు.. గవర్నర్ వ్యవస్థ సరిగ్గా లేదంటూ దేశంలో కొంతమంది గవర్నర్లు గలీజ్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజ మెత్తారు. తెరాస ప్లీనరీ వేదికపై కేసిఆర్ ఈ విధమైన కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర సర్కార్ 12మంది ఎమ్మెల్సీల కొరకు కేబినెట్ మొత్తం తీర్మానం చేసి పంపిస్తే ఒక సంవత్సరం పాటు ఆయన దగ్గరే ఉంచుతున్నారని అన్నారు.
Advertisement
అలాగే తమిళనాడు అసెంబ్లీ బిల్లును పాస్ చేసి పంపితే తమిళనాడు గవర్నర్ చాలా విచిత్ర దోరణితో ప్రవర్తిస్తున్నారు. మహారాష్ట్ర, కేరళ, బెంగాల్,తమిళనాడు, గవర్నర్లతో చాలా పంచాయతీ ఉందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆ కాలంలో ఎన్టీఆర్ పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేయాలని భావించారు. యువకుడిగా మేము ఆయన కింద పని చేసాం. 200 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి కూడా వచ్చాం. ఈ దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థతో ప్రజా సేవ చేస్తున్నటువంటి ఎన్టీఆర్ ను పదవి నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఇదంతా మేము కళ్లారా చూశాం.
Advertisement
హైదరాబాద్ వేదికగా జరిగిన చరిత్ర ఇది. ఆనాడు ఉన్న కాంగ్రెస్ సర్కారును తెలుగు రాష్ట్రాల ప్రజలు మళ్ళీ ఎన్టీఆర్ ను అదే సింహాసనం మీద కూర్చోబెట్టారని అన్నారు. ఆ సమయంలో దుర్మార్గంగా ప్రవర్తించిన గవర్నర్.. అవమానంతో ఇక్కడి నుంచి తొలగించబడ్డారు. ఆ సంఘటన నుంచైనా దేశం గుణపాఠం నేర్చుకోవాలి. కానీ ఈ రోజు గవర్నర్ల వ్యవస్థ వక్రమార్గంగా ఉందని తెలియజేశారు. త్వరలోనే దేశంలో ఉన్న విద్రోహ శక్తులను తరిమి కొడతామని కెసిఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
ALSO READ;
సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న 7గురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీరే…!
కేజీఎఫ్ ఛాప్టర్ -2 అంతటా ఫుల్ కలెక్షన్లు.. అక్కడ మాత్రం అంతంతే..?