Home » వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న కేసీఆర్.. ప్రజల్లోకి వచ్చేది అప్పుడేనా..?

వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న కేసీఆర్.. ప్రజల్లోకి వచ్చేది అప్పుడేనా..?

by Anji
Ad

బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కోటుకుంటు న్నారు. హిప్‌ రిప్లేస్‌మెంట్‌ తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. సర్జరీ తర్వాత ముందుగా హైదరాబాద్ నందినగర్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో కేసిఆర్ చికిత్స తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, సహాయకులు ఎప్పటికప్పుడు పర్యవే క్షిస్తున్నారు.

Advertisement

Advertisement

ప్రస్తుతం కేసీఆర్‌ ఊత కర్ర సాయంతో నడుస్తున్నారు. అయితే సర్జరీ నాటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో కేసీఆర్  నడుస్తున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం  ( X)  ట్విట్టర్  లో ఎంపీ సంతోష్ కుమార్ పోస్ట్ చేశారు.  మరింత దృఢ సంకల్పంతో కేసీఆర్‌ త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని ఎంపీ సంతోష్ కుమార్ పోస్ట్ చేసిన చేశారు. ఇక ఇదిలా ఉండగా ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు వస్తుడడంతో భారీగా సన్నాహాలు చేయాలనీ బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అదే రోజు నుంచి కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తారనే చర్చ జరుగుతోంది. వచ్చే నెల 20 తరువాత కేసీఆర్ మొదటి సరిగా గజ్వేల్ లో పర్యటించనున్నట్లు సమాచారం. పార్టీ కార్యకలాపాలను ఇకపై తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక కూడా ఇక్కడే జరపనున్నట్లు సమాచారం.

Visitors Are Also Reading