Home » కేసీఆర్‌ ప్రధాని కాడు.. హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

కేసీఆర్‌ ప్రధాని కాడు.. హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

by Anji
Ad

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒకే నాణానికి బొమ్మా బొరుసు లాంటివని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు . వారి నినాదాలు మాత్రమే వేరు, విధానాలు ఒకటే అని అన్నారు.  జెండాలు మాత్రమే వేరు, ఎజెండా మాత్రం ఒకటే అని.. బలహీనమైన రాష్ట్రాల, బలమైన కేంద్రమే ఈ రెండు పార్టీల విధానం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రల హక్కులను కాల రాయడంలో రెండింటిదీ ఒకే దారి అని విమర్శించారు.

Advertisement

ఉమ్మడి జాబితాలోని అంశాలను ఒక్కొక్కటిగా కేంద్రానికి బదిలీ చేసింది ఈ పార్టీలే. రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వానికి ధారాదత్తం చేసిన చరిత్ర ఈ పార్టీలదే. రాష్ట్రాలను నామమాత్రం చేయడమనే దీర్ఘకాలిక లక్ష్యానికి రెండు పార్టీలు జోడెద్దుల్లా పనిచేస్తున్నాయని అన్నారు. కొద్ది నెలల్లో జరగబోయే లోకసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు కొన్ని రోజులుగా ఒకే రకమైన ప్రకటనలు చేస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ‘బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు. కాంగ్రెస్‌ గెలిస్తే రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారు. బీఆర్‌ఎస్‌ గెలిస్తే కేసీఆర్‌  ప్రధాని కారు కదా? మరి బీఆర్‌ఎస్‌కు  ఎందుకు ఓటెయ్యాలి?  అసలు పార్లమెంట్‌ ఎన్నికలతో బీఆర్‌ఎస్‌కు ఏం సంబంధం?’ ఇలా సాగుతుంది ఆ రెండు పార్టీల నాయకుల వాదన.

Advertisement

బీఆర్‌ఎస్‌ లాంటి ప్రాంతీయ శక్తులకు అసలు లోక్‌సభ ఎన్నికలతో ఏం పని? బీఆర్‌ఎస్‌ కు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు/ అర్హత, ఏంటి? అని ప్రశ్నించే దాకా తెగింపు ప్రదర్శిస్తున్నాయి. పైకి చూస్తే ఇది నిజమే కదా? అనిపిస్తుంది. కానీ, ఆ ప్రకటనల, వాదనల లోగుట్టు చాలా వికృతమైనది. ఈ రెండు పార్టీలు ఒకే స్వరం వినిపించడం వెనుక కచ్చితంగా రహస్య ఎజెండా ఉందన్నారు హరీశ్ రావు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading