తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలు ఫిబ్రవరి 17న జరుగున్నాయి. ఈ తరుణంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ సంవత్సరం కేసీఆర్ 68వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ జన్మదిన సంబురాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుందాం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేవిధంగా సంబురాలు ఉండాలని కేసీఆర్ సూచించారట.
Also Read : జీరో రూపాయి నోటు ఉందని మీకు తెలుసా..? దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే..?
Advertisement
Advertisement
కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 15న తెలంగాణ వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహారం పంపిణీ, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలను చేపట్టాలని పేర్కొన్నారు. ఈనెల 17న కేసీఆర్ పుట్టినరోజు నాడు రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయపడేందుకు గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఏ సేవా కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చు అని కేటీఆర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
Also Read : రియల్‌స్టార్ శ్రీహరి భార్య ఎన్నో శాపాలు పెట్టేదట.. దర్శకుడు శంకర్ ఏమన్నారంటే..?