Home » కత్రినా విక్కీ కౌశల్‌ల వివాహం రాజస్తాన్‌లోనే..

కత్రినా విక్కీ కౌశల్‌ల వివాహం రాజస్తాన్‌లోనే..

by Bunty
Published: Last Updated on
Ad

కత్రినాకైఫ్‌ విక్కీ కౌశల్‌ వివాహ వేదిక సిద్ధమైంది. ఈ జంట ఇప్పటికే రాజస్థాన్‌లోని సవాయి మాదోపూర్‌ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా కోటలో జరగనున్నట్టు సమాచారం. కాగా వీరి పెండ్లికి వచ్చే అతిథులకు అనేక ఆంక్షలు విధించారు. ఇప్పటికే వీరి పెండ్లికి జిల్లా కలెక్టర్‌ రాజేంద్ర కిషన్‌, ఎడీఎమ్‌ సూరజ్‌ సింగ్‌ నేగీ, సూపరిన్‌డెంట్‌ఆఫ్‌ పోలీస్‌రాజేంద్ర సింగ్‌తో కలిసి పెండ్లి ఎంత మంది వరకు వస్తారు అనే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే కత్రినా కైఫ్‌ విక్కీ కౌశలో ఈ కోటను మూడు రోజుల పెండ్లి వేడుకల కోసం డిసెం ముందుగానే డిసెంబర్‌ 6 నుంచి 11వరకు బుక్‌ చేసుకున్నారు. ఈ జంట పెండ్లికి బాలీవుడ్‌ ప్రముఖులు డైరెక్టర్‌ కబీర్‌ ఖాన్‌, ప్రొడ్యూసర్‌ అమ్రుత్‌పాల్‌ సింగ్‌ బింద్రా, డైరెక్టర్‌ ఆనంద్‌తివారీ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. విక్కి, కత్రినా అభిమానులు ఈ జంటను వికాత్‌ పేరుతో పిలుస్తున్నారు. వీరి పెండ్లి కోసం ఆ ప్రాంతంలోని 45 హోటల్స్‌ రూంలను అతిథుల కోసం ముందుగానే బుక్‌ చేసింది. ఇదిలా ఉంటే వెడ్డింగ్‌ సెర్మనీ ఫోటో షూట్‌ను ఈ జంట ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు అమ్మినట్టు సమాచారం.

Advertisement

Advertisement

అయితే ఆ ప్రాంతంలో పోటో షూట్‌లకు అనుమతి లేదని అక్కడి ముఖ్య అధికారులు తెలిపారు. వెడ్డింగ్‌ ప్లానర్స్‌, ఈవెంట్‌ మేనేజర్లు పర్మిషన్‌ తీసుకున్న తర్వాతనే పెండ్లి పోటోలు తీసుకునేందుకు అనుమతిని ఇవ్వాల వద్ద అనే విషయాన్ని ఆలోచించనున్నారు అధికారులు. ఏది ఏమైనా ఎట్టకేలకు విక్కి-కత్రినా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

Visitors Are Also Reading