Home » కత్రినా, విక్కీ వైట్ వెడ్డింగ్… అంటే ఏంటో తెలుసా ?

కత్రినా, విక్కీ వైట్ వెడ్డింగ్… అంటే ఏంటో తెలుసా ?

by Bunty
Ad

బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఈ సెలబ్రిటీ కపుల్ వెడ్డింగ్‌ పెళ్లి ఆచారాల నుండి విలాసవంతమైన ఈవెంట్‌ల వరకు వైభవంగా జరగబోతోంది. కత్రినా, విక్కీ రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి వివాహం హిందూ ఆచారాల ప్రకారం కాగా, రెండోది క్రిస్టియన్ పెళ్లి జరగనుంది. అందులోనే వైట్ వెడ్డింగ్ అనేది ఒక ప్రత్యేకమైన పెళ్లి. ఈ తరహా పెళ్లిళ్లలో పెళ్లి కూతురు తెల్లటి గౌనులో కనిపించడం, పెళ్లి థీమ్ మొత్తం తెల్లగా ఉండడం అద్భుతంగా ఉంటుంది. ఇందులో టేబుల్ కవర్ నుండి ప్రతీది తెలుపు రంగులో ఉంటాయి. కాబట్టి దీనిని వైట్ వెడ్డింగ్ అంటారు.

Advertisement

Advertisement

ఈ రకమైన వివాహం క్రైస్తవ మతంలో జరుగుతుంది. ఇది అమెరికా, బ్రిటన్‌లలో చాలా తరచుగా కనిపించే ధోరణి. దీనిలో ఇటీవల అనేక పరిశోధనలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో అమెరికాలో 80 శాతం మంది వధువులు పెళ్లి రోజున తెలుపు రంగు గౌను ధరించడానికి ఇష్టపడుతున్నారని తేలింది. ఇప్పుడు కత్రినా కూడా వైట్ వెడ్డింగ్ చేసుకుంటే, నటి తెల్లటి గౌనులో కనిపిస్తుందని అంటున్నారు. అయితే ఈ రకమైన వివాహం కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే ప్రారంభమైంది. కానీ ఇప్పుడు దాన్ని కూడా మతంతో ముడిపెట్టి చూస్తున్నారు. నిజానికి తెలుపు రంగు స్వచ్ఛతతో ముడిపడి ఉంటుంది. కాబట్టి వధువులు తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. మొత్తానికి కత్రినా పెళ్లి దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది.

Visitors Are Also Reading