Home » రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా వదులుకున్న కార్తీకదీపం నటి..!

రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా వదులుకున్న కార్తీకదీపం నటి..!

by Anji
Ad

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రస్తుతం తెలియని వారు ఉండరు. ముఖ్యంగా బాహుబలి సిరీస్ సినిమాలతోపాటు ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా రాజమౌళికి గొప్ప పేరు వచ్చింది.

Advertisement

సినిమాలు కూడా రికార్డులను క్రియేట్ చేశాయి. బాహుబలి సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాల ద్వారానే రాజమౌళి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు అని చెప్పవచ్చు. అలాంటి రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో నటించే అవకాశం వచ్చినా ఇంగ్లీష్ చేసుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు.

Advertisement


ముఖ్యంగా రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే వారు ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న పాత్ర అయినా రాజమౌళి చాలా పేరు తీసుకుని అద్భుతంగా డిజైన్ చేస్తాడు. ఆపాత్ర ను ఎంపిక చేసిన నటీనటులు న్యాయం చేసేంతవరకూ రాజమౌళి వారిని వదిలిపెట్టరు. అక్కడనే అసలు సమస్య వస్తోంది. దీంతో చాలామంది రాజమౌళి సినిమాను మిస్ చేసుకుంటున్నారు. ఈ లిస్టులో కార్తీకదీపం నటి ప్రేమి విశ్వనాథ్ కూడా ఉన్నది. ప్రేమి విశ్వనాథ్ అంటే మరెవరో కాదండి కార్తీకదీపం  సీరియల్ లో  నటించిన  దీప.

వంటలక్క రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ లో మళ్లీ అనే పాపకు తల్లిగా నటించాల్సి ఉంది. ఆ సమయంలో వంటలక్క చాలా ఉంది. రాజమౌళి అడిగిన కాల్షీట్లు ఆమె అడ్జెస్ట్ చేయలేక ఏకంగా నో చెప్పేసిందట. ఆ పాత్రకు అహ్మరిన్ అంజుం అనే నటిని ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమాలో ఈమెకు రెండే సీన్లు ఉంటాయి. సినిమా ప్రారంభంలో ఒక్కసారి కనిపించి.. మరల సినిమా ముగింపులో కనిపించడం విశేషం.

Visitors Are Also Reading