Home » బాలీవుడ్ కుర్ర హీరోకు వార్నింగ్ ఇచ్చిన ట‌బు…!

బాలీవుడ్ కుర్ర హీరోకు వార్నింగ్ ఇచ్చిన ట‌బు…!

by AJAY
Ad

ప్ర‌స్తుతం రీమేక్ సినిమాల హ‌వా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. భాష‌తో సంబంధం లేకుండా హిట్ ప‌డిందంటే ఆ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుని త‌మ నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా మార్పులు చేర్పులు చేసి తెర‌కెక్కిస్తున్నారు. అలా రీమేక్ లు చేసి హిట్లు కొడుతున్న స్టార్ లు ఎంద‌రో ఉన్నారు. ఇక మిగ‌తా ఇండ‌స్ట్రీల‌తో పోలిస్తే తెలుగు, మ‌ల‌యాళ సినిమాల‌ను ఎక్కువ‌గా రీమేక్ చేస్తున్నారు. మ‌ల‌యాళ సినిమాల‌ను మ‌న‌వాళ్లు ఎక్కువ‌గా రీమేక్ చేస్తుంటే మ‌న సినిమాల‌ను బాలీవుడ్ స్టార్ లు ఎక్కువ‌గా రీమేక్ చేస్తున్నారు.

kartheek aryan tabu

kartheek aryan tabu

రీసెంట్ గా నాని నటించిన జెర్సీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయ‌గా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో క‌భీర్ సింగ్ పేరుతో రీమేక్ చేయ‌గా ఆ సినిమా కూడా అక్క‌డ ఊపేసింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా న‌టించిన అల వైకుంఠ‌పురంలో సినిమాను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ కుర్ర హీరో కార్తీక్ ఆర్య‌న్ న‌టిస్తున్నారు.

Advertisement

Advertisement

అంతే కాకుండా సినిమాలో కృతి స‌న‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే అల వైకుంఠ‌పురంలో అల్లు అర్జున్ త‌ల్లిగా ట‌బు న‌టించిన సంగ‌తి తెలిసిందే కాగా ట‌బు తాజాగా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న కార్తీక్ ఆర్య‌న్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. కార్తీక్ ఆర్యన్ ద‌ర్శ‌కుడు క‌లిసి దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా ఆ ఫోటోకు ట‌బు ఇది చాలా మంచి సినిమా జాగ్ర‌త్త‌గా రీమేక్ చేయండి అంటూ కామెంట్ పెట్టింది. దానికి కార్తీక్ ఆర్య‌న్ రిప్లై ఇస్తూ ఇది మీ సినిమా కాబ‌ట్టే చాలా ప్రేమ‌తో చేస్తున్నామంటూ రిప్లై ఇచ్చారు.

Visitors Are Also Reading