కొరియాలోని ఓ హోటల్ లో ఇండియాకు చెందిన ఒక జంట డిన్నర్ చేస్తున్నారు. వారు ఇండియా నుండి మంచి ప్యాకేజ్ తో కొరియాలోని సామ్ సంగ్ కంపెనీకి లో జాబ్ చేస్తున్నారు. ఏడాదికి కోట్లలో జీతం. డిన్నర్ చేస్తున్న సందర్భంలో వారిద్దరి మధ్య పెళ్లి గురించి చర్చ నడుస్తోంది.
Advertisement
- అబ్బాయి: చెప్పు …నిన్ను సంతోషంగా ఉంచాలంటే ఏం చేయాలి?
- అమ్మాయి: నిన్ను IAS గా చూడాలని ఉంది., సాధ్యమేనా?
- అబ్బాయి: అదే నీ కోరికైతే దాన్ని సాధించడమే నా లక్ష్యం అని అక్కడే మాట ఇచ్చేశాడు.
కట్ చేస్తే……ఆ అబ్బాయి 2018 లో UPPSC లో మొదటి ర్యాంక్ సాధించాడు. అతడి పేరే కనిష్క్ కటారియా అతని లవర్ సోనల్ ! 2019లో వీరి పెళ్లి అయ్యింది.
Advertisement
అంత ఈజీగా లక్ష్యాన్ని ఎలా సాధించాడు?
కటారియా తండ్రి కూడా IAS ఆఫీసరే కాబట్టి సివిల్స్ ప్రిపరేషన్ గురించి కాస్త అవగాహన ఉంది. లవర్ కు ఇచ్చి మాట కోసం సామ్ సంగ్ కంపెనీకి రిజైన్ చేసి ఢిల్లీ చేరుకున్నాడు కటారియా… ఓ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యి 8 నెలలు కష్టపడి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత రోజుకు 12 గంటలు ప్రిపేర్ అయ్యి 2018 సివిల్స్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.
Also Read: Today rasi phalalu in telugu :ఈ రాశివారు అదృష్టవంతులు