Home » Today rasi phalalu in telugu :ఈ రాశివారు అదృష్ట‌వంతులు

Today rasi phalalu in telugu :ఈ రాశివారు అదృష్ట‌వంతులు

by Anji

రాశిఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

ఈరోజు ఈ రాశివారు మీ శ్రీ‌మ‌తి స‌హాయం లేనిదే మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రాం కావు అని గ్ర‌హించండి. విద్యార్థులు ప్రేమ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. వైద్యుల‌కు శ‌స్త్రచికిత్స చేయ‌న‌ప్పుడు ఏకాగ్ర‌త అవ‌స‌రం. ఆల‌య సంద‌ర్శ‌నాల‌లో ఇబ్బందుల‌ను ఎదుర్కుంటారు. నిరుద్యోగుల‌కు ప్ర‌ముఖుల స‌హ‌కారంతో స‌ద‌వ‌కాశాలు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : వృషభం 

ఈరోజు ఈ రాశివారికి బ్యాంకు ప‌నులు మంద‌కోడిగా సాగుతాయి. ఆప‌ద స‌మ‌యంలో స‌న్నిహితులు అండ‌గా నిలుస్తారు. ఆహ‌ర వ్య‌వ‌హారాల్లో మెళుకువ అవ‌స‌రం. సోద‌రి, సోద‌రుల మ‌ధ్య అనురాగ వాత్స‌ల్యాలు పొంద‌గ‌ల‌వు. ఉపాధ్యాయుల‌కు యాజ‌మాన్యం ఒత్తిడి అధికం. రాజ‌కీయ నాయ‌కుల‌కు ప్ర‌యాణాల్లో మెళుకువ అవ‌స‌రం.

Today rashi phalau in telugu : మిథునం

ఈరోజు ఈ రాశిలోని బేక‌రి, తినుబండారాల వ్యాపారుల‌కు లాభ‌దాయ‌కం. ప్ర‌యివేటు రంగాల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవ‌స‌రం. అధికారుల‌తో వీలైనంత క్లుప్తంగా సంభాషించ‌డం క్షేమ‌దాయ‌కం.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ఈరోజు రాశిలోని ఉద్యోగ‌స్తుల‌కు విధి నిర్వ‌హ‌ణ‌లో మంచి గుర్తింపు రాణింపు ల‌భిస్తుంది. వ‌స్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, స్వీ్ షాపులు వ్యాపారుల‌కు పురోభివృద్ధి, విద్యార్థుల‌కు అనుకోని చికాకులు ఎదుర‌వుతాయ‌యి. రాజ‌కీయాల్లో వారికి కార్య‌క‌ర్త‌ల వ‌ల్ల ఇబ్బందులు త‌ప్ప‌వు. ఆడిట‌ర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.

Today rashi phalau in telugu : సింహం

ఈరోజు ఈ రాశిలోని స్త్రీల‌కు ప్ర‌తీ విష‌యంలో ఓర్పు, నేర‌ప్ఉ అవ‌స‌రం అని గ‌మ‌నించండి. ఖ‌ర్చులు పెరిగినా ఆర్థిక సంతృప్తి ప్ర‌యోజ‌నం పొందుతారు. నిరుద్యోగుల‌కు ఇంట‌ర్వ్యూ స‌మాచారం అందుతుంది. ఉద్యోగ‌స్తుల‌కు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు ల‌భిస్తుంది. రాజ‌కీయ రంగాల్లో వారు ప్ర‌త్య‌ర్థుల వ‌ల్ల స‌మ‌స్య‌లు ఎదుర్కుంటారు.

 

Today rashi phalau in telugu : క‌న్య

ఈరోజు ఈ రాశివారు కుటుంబ స‌మస్య‌లు ఆర్థిక వ్య‌వ‌హారాల ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హిస్తారు. వ్యాపారాల్లో నిల‌దొక్కుకోవ‌డానికి మ‌రింత‌గా శ్ర‌మించాల్సి ఉంటుంది. ప‌త్రికా, ప్రైవేటు రంగాల వారికి ఆర్థిక ప్ర‌గ‌తితో కూడాని అవ‌కాశాలు ల‌భిస్తాయి. బంధ‌వుల రాక వ‌ల్ల మాన‌సిక ఆందోళ‌న త‌ప్ప‌దు.

Today rashi phalau in telugu : తుల

ఈ రోజు ఈ రాశివారికి ఇత‌రుల కార‌ణంగా ప‌నులు కార్య‌క్ర‌మాలు వాయిదా ప‌డ‌డంతో నిరుత్సాహం త‌ప్ప‌దు. మీ మాట‌కు కుటుంబంలో విలువ పెరుగుతుంది. దంప‌తుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థాలు చోటు చేసుకుంటాయి. మిత్రుల స‌హాయ‌, స‌హ‌కారాలు అందించ‌డం వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గం కాన‌రాగ‌ల‌దు.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఈరోజు ఈ రాశివారు ఆర్థిక విష‌యాల్లో ఒక‌డుగు ముందుకు వేస్తారు. ఉద్యోగ‌స్తుల‌పై అధికారుల‌కు వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన ప‌రిస్థితులు నెల‌కొంటాయి. వ్యాపారా అభివృద్ధికి చేయు కృషి స‌త్ప‌లితాల‌నిస్తుంది. ధ‌నం చేతిలో నిల‌బ‌డ‌డం క‌ష్టం కావ‌చ్చు. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు తీర‌తాయి. పెద్ద‌ల స‌ల‌హాను పాటించి మీ గౌర‌వాన్ని నిల‌బెట్టుకుంటారు.

Today rashi phalau in telugu : ధనస్సు

ఈరోజు ఈ రాశివారు ప్ర‌ముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. శ‌తృవుల‌పై విజ‌యం సాధిస్తారు. సాంఘిక కార్య‌క్ర‌మాల ప‌ట్ల ఆస‌క్తి పెరుగుతుంది. రాబ‌డికి ఖ‌ర్చులు అధికం అవుతాయి. శ్రీ‌వారు, శ్రీ‌మ‌తి గౌర‌వ ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించే ప‌రిణామాలు ఎదుర్కుంటారు. అప‌రిష్కృతమైన మీ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం దిశ‌గా ప‌య‌నిస్తాయి.

Today rashi phalau in telugu మకరం

ఈరోజు ఈ రాశివారికి వాహ‌నం అమ‌ర్చుకోవాల‌నే కోరిక నెర‌వేరుతుంది. విద్యార్థుల‌కు మిత్ర బృందాల వ‌ల్ల స‌మ‌స్యలు త‌లెత్తే ఆస్కారం ఉంది. మెళుకువ వ‌హించండి. ప్రేమ వ్య‌వ‌హారాల‌కు ఎదురైనందుకు ఆనందించండి.

Today rashi phalau in telugu : కుంభం

ఈ రోజు ఈరాశిలోని ఉపాధ్యాయుల‌కు ఒత్తిడి, చికాకులు అధిక‌మ‌వుతాయి. వాతావ‌రణంలోని మార్పుల వ‌ల్ల మీ ప‌నులు వాయిదా ప‌డ‌తాయి. మీ మొండి వైఖ‌రి మీకు చికాకు క‌లిగిస్తుంది. ప‌ని పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి బాగా శ్ర‌మిస్తారు.

Today rashi phalau in telugu : మీనం

ఈరోజు ఈ రాశివారి వ్యాసాగాలు మ‌రింత‌గా పుంజుకుంటాయి. గృహ‌నికి కావాల్సిన వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార రంగాల వారికి నూత‌న వెంచ‌ర్ల విష‌యంలో పున‌రాలోచ‌న మంచిది. ఇత‌రుల మెప్పు కోసం శ్ర‌మాధిక్య‌త, ఒత్తిడి ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. పెద్ద‌ల ఆరోగ్యం గురించి ఆందోళ‌న క‌లిగిస్తుంది.

Visitors Are Also Reading