Home » రాత్రిపూట హీరోల గదులకు నేను వెళ్ళను-కంగానా

రాత్రిపూట హీరోల గదులకు నేను వెళ్ళను-కంగానా

by Bunty
Ad

చిత్రపరిషంలో కాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడు ఎవరో ఒకరు నోరు విప్పుతూనే ఉంటారు. ఎక్కువగా కెరీర్ ముగిసిన హీరోయిన్లు తాము కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నామని చెబుతుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ బాంబు పేల్చింది. కాంట్రవర్సీ క్వీన్ గా పేరు గాంచిన కంగానా, సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక టాపిక్ గురించి ఘాటుగా స్పందిస్తూ హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఈ భామ ఇటీవల తన తల్లి ఓ పొలంలో పనిచేస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Advertisement

తన తల్లి బాలీవుడ్ హీరోయిన్ కు తల్లి అయినప్పటికీ నేటికీ వ్యవసాయం చేస్తూ తన అభిరుచిని చాటుకుంటుందని తెలిపారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వగా, నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్ చేశారు. ఓ నెటిజన్, “లక్షాధికారి అయిన తర్వాత కూడా, కంగాన తల్లి పొలంలో పనిచేస్తుంది. ఆమె చాలా సింప్లిసిటీతో ఉన్నారు”, అని రాసుకొచ్చాడు. ఇదే విషయమే కంగానా స్పందించారు. “దయచేసి ఓ విషయం గమనించండి. నావల్ల నా తల్లి సంపన్నురాలు కాదు.

Advertisement

Kangana Ranaut calls the film industry 'crass and crude': 'Exposes their lowly standards… deprived lives' | Entertainment News,The Indian Express

నేను వ్యాపారవేత్తలు ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. కానీ మా అమ్మ 25 ఏళ్లకు పైగా టీచర్ గా పనిచేసింది. బాలీవుడ్ అనేది ఓ మాఫియా. ఈ మాఫియాపై నేను రియాక్ట్ అయ్యే తీరుకి కారణం ఆమెనే. అందరిలా ముసి ముసి నవ్వులు, ఐటెం సాంగ్స్, పెళ్లిళ్లలో డ్యాన్సులు, రాత్రిపూట హీరోల గదులకు వెళ్లడం వంటి పనులు నేను చేయలేను, చేయను, అందుకే నాపై పిచ్చిది అనే ముద్ర వేసి జైలుకు పంపేందుకు కుట్రలు చేశారు” అని కంగానా ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది.

READ ALSO : Rashmi Gautam : యాసిడ్ పోస్తా అంటూ… యాంకర్ రష్మీకి బెదిరింపులు..!

Visitors Are Also Reading