Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఢిల్లీ అసెంబ్లీకి కంగనా డుమ్మా… కారణం ఏంటంటే ?

ఢిల్లీ అసెంబ్లీకి కంగనా డుమ్మా… కారణం ఏంటంటే ?

by Bunty
Ads

కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఈరోజు ఢిల్లీ అసెంబ్లీలోని పీస్ అండ్ హార్మొనీ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సిక్కు కమ్యూనిటీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నటి కంగనా రనౌత్‌పై గతంలో ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య కమిటీ నటి కంగనాకు సమన్లు ​​పంపింది. సమన్లలో డిసెంబర్ 6 మధ్యాహ్నం 12:00 గంటలకు కమిటీ ముందు హాజరు కావాలని కంగనాను కోరింది. కంగనా రనౌత్ న్యాయవాది కొన్ని వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల కంగనా ఈ రోజు రాలేరని తెలియజేస్తూ లేఖ రాశారు. కంగనా కొన్ని వారాల సమయం కోరింది. దీంతో నేటి సమావేశం వాయిదా పడింది. ఆమె అభ్యర్థన మేరకు కమిటీ నిర్ణయం తీసుకొని ఆమెకు తెలియజేస్తుంది.

Advertisement

Advertisement

kangana

Ad

సోషల్ మీడియాలో కంగనా తన ఇటీవలి పోస్ట్‌లో “ఉద్దేశపూర్వకంగా” రైతుల నిరసనను ‘ఖలిస్తానీ ఉద్యమం’ అని పిలిచారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ తన ప్రకటనలో నటి సిక్కు సమాజానికి వ్యతిరేకంగా “అభ్యంతరకరమైన మరియు అవమానకరమైన” పదజాలాన్ని ఉపయోగించిందని పేర్కొంది. అదే సమయంలో ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ప్రకటన ప్రకారం సిక్కు సమాజం, మనోభావాలను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా పోస్ట్ చేసిందని అన్నారు. కాగా కంగనా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. అందుకే ఆమెను కాంట్రవర్సీ క్వీన్ అంటారు.

Visitors Are Also Reading