కంగన రనౌత్ ఈ మధ్య తరుచూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్ అనే చెప్పవచ్చు. దేశం గురించి, మహిళల గురించి తన గురించి అయినా ఎవరైనా తప్పుగా మాట్లాడితే తక్కువ చేసి మాట్లాడినా కంగనా వెంటనే ఫైర్ అవుతుంది. బాలీవుడ్లో కొంతమందిని, నెపోటిజాన్ని వ్యతిరేకిస్తుంది. బాలీవుడ్ కల్చర్‌ను వ్యతిరేకిస్తుంది. ఎవరినైనా సరే ఎంతటి వారినైనా సరే తన మాటలతో చెడుగుడు ఆడిస్తుంది బాలావుడ్ బ్యూటీ.
Advertisement
ఒక పక్క అదిరిపోయే సినిమాలు చేస్తూ.. మరొపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ దేశంలో జరిగే విషయాలపై తన రీతిలో స్పందిస్తుంది. ఎన్నోసార్లు ఎంతో మందిపై భయపడకుండా కామెంట్లు చేస్తోంది. కంగనా వివాదాల్లో కూడా ఎప్పుడు ఉంటుంది. అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకెళ్లిపోతుంది. తాజాగా సౌత్ స్టార్లపై తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.
Advertisement
ఇటీవల సౌత్ హీరోలు పాన్ ఇండియా స్టార్‌గా మారుతూ ఇండియా మొత్తం మార్కెట్‌ను సాధిస్తున్నారు. బాలీవుడ్లో కూడా తమ సత్తా చాటుతున్నారు. బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్లో కలెక్షన్లు సాధిస్తున్నారు. సౌత్ స్టార్స్. ఇటీవల పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా బాలీవుడ్లో స్టార్ అయిపోయాడు. దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు సౌత్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో కంగనా ఈ పోస్ట్ చేసింది.
తన స్టోరీలో అల్లుఅర్జున్, యశ్ఫోటోలను షేర్ చేస్తూ.. సౌత్ కంటెంట్ కు సౌత్ స్టార్లకు ఎందుకు అంత ఆదరణ లభిస్తుందంటే. దక్షిణాది స్టార్లు మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. తమ కుటుంబాలకు, బాంధవ్యాలకు వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. సినిమాపై వారికి ఉన్న ఫ్యాషన్, వృత్తిపరమైన నిబద్ధత పారమైనది అని పోస్ట్ చేసింది. అయితే ముఖ్యంగా ఇందులో బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు. వారి వలలో చిక్కుకోకండి అంటూ పోస్ట్ చేసింది.