నందమూరి హీరోలలో బాలకృష్ణ, ఎన్టీఆర్ తరువాత క్రేజ్ ఉన్న హీరో కళ్యాణ్ రామ్ అనే చెప్పాలి. ఆయన తీసిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికీ అందులో కొన్నింటిని మాత్రమే ప్రేక్షకులు ఆదరించారు. కళ్యాణ్ రామ్ తన చివరి సినిమా 2020లో ఎంత మంచి వాడవురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా తరువాత రెండేళ్ల గ్యాప్ తరువాత వస్తున్న మూవీ బింబిసార. బాహుబలి తరువాత ఆ స్థాయిలో వస్తున్న పాంటసీ చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు.
ఇవాళ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చిత్ర యూనిట్ ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ తరుణంలోనే యాంకర్ సుమతో చిత్ర యూనిట్ ఓ స్పెషల్ చిట చాట్లో పాల్గొన్నారు. లంచ్ చేస్తూ పలు అంశాల గురించి ప్రస్తావించారు. ఇందులో భాగంగానే తన తండ్రి చనిపోయిన రోజునే ఏం జరిగిందో గుర్తు చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు కళ్యాణ్ రామ్. ఇక నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని సుమ అడగగా కళ్యాణ్ రామ్ ఇలా సమాధానం చెప్పాడు. ఉదయం 5.30 గంటల సమయంలో బాల్కనీలో కూర్చొని టీ తాగుతుండగా.. కాల్ వచ్చింది.
తన తండ్రితో కలిసి ట్రావెల్ చేస్తున్న శివాజీ రెడ్డి అనే వ్యక్తి కాల్ చేసి ఫోన్ లో ఏడుస్తున్నాడు. ఆ సమయంలో తనకేమి అర్థం కాలేదు. ఏం జరిగిందో తెలుసుకుందాం అని శివాజీ అని పిలిచాను. కానీ అప్పటికే కాల్ కట్ అయిందని చెప్పారు. ఇక ఆ తరువాత మావయ్యకు చెందిన ఫ్యాక్టరీ నుంచి ఒక ఉద్యోగి విజయవాడకు వెళ్తూ కాల్ చేసి కొన్ని ఫోటోలను పంపించాడని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 2018 ఆగస్టు 29న హరికృష్ణ మరణించారు. ఇటీవలే హరికృష్ణ సోదరి, కళ్యాణ్ రామ్ మేనత్త ఉమా మహేశ్వరి మరణించిన విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో నందమూరి కుటుంబ సభ్యులు ఆగస్టు నెలలోనే ఎక్కువగా మరణిస్తున్నారని వైరల్ అవుతోంది.
Also Read :
ప్రముఖ నటుడు నగేష్ కి ఎన్టీఆర్ ఎంత గొప్ప సాయం చేశారో మీకు తెలుసా..?
Bimbisara movie review: కళ్యాణ్ రామ్ “బింబిసార” రివ్యూ…!