Home » నందమూరి కళ్యాణ్ రామ్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే !

నందమూరి కళ్యాణ్ రామ్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే !

by AJAY
Published: Last Updated on
Ad

నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట‌వార‌సులుగా సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌తి హీరో స‌క్సెస్ అయ్యారు. బాల‌య్య‌, ఎన్టీఆర్ త‌ర‌వాత మ‌ళ్లీ అంత‌టి క్రేజ్ ను నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ సంపాదించుకున్నారు. క‌ల్యాణ్ రామ్ ఓ వైపు సినిమాల‌ను నిర్మిస్తూ మ‌రోవైపు హీరోగా కూడా రాణిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌ల్యాణ్ రామ్ బింబిసార అనే భారీ విజువ‌ల్ వండ‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పోస్టర్స్ బాహుబ‌లి, మ‌గ‌ధీర రేంజ్ లో క‌నిపిస్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే క‌ల్యాణ్ రామ్ సినిమాల గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు కానీ క‌ల్యాణ్ రామ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాత్రం అతికొద్ది మందికి మాత్ర‌మే తెలుసు. క‌ల్యాణ్ రామ్ 2006 ఆగ‌స్టు 10వ తేదీన‌ స్వాతిని వివాహం చేసుకున్నాడు. వీరిద్ద‌రిది పెద్ద‌లు కుదిర్చిన వివాహం. క‌ల్యాణ్ రామ్ మొద‌ట స్వాతిని పెళ్లి చూపుల‌ప్పుడే చూసి మ‌న‌సు పారేసుకున్నారు.

Advertisement

వృత్తి రిత్యా స్వాతి డాక్ట‌ర్ కాగా ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు జ‌న్మిచారు. వారి పేర్లు తార‌క అదైత మ‌రియు శౌర్య‌రామ‌…..ఇక స్వాతి కల్యాణ్ రామ్ సినిమాల‌ను ఎంజాయ్ చేస్తుంది. శతమానంబ‌వతి సినిమా చూసి క‌ల్యాణ్ రామ్ తో ఇలాంటి సినిమా చేయ‌వ‌చ్చు క‌దా అని క్లాస్ కూడా తీసుకుంద‌ట‌. అప్ప‌టి నుండి క‌ల్యాణ్ రామ్ అన్ని ర‌కాల పాత్ర‌లు చేయాల‌ని నిర్నయించుకున్నారు.

స్వాతి వాళ్ల‌ది సంప‌న్నుల కుటుంబం. స్వాతి తండ్రికి ఫార్మా ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటూ ఎల‌క్ట్రిక‌ల్ ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి. ఎంబీబీఎస్ చ‌దివిన స్వాతి పెళ్లి త‌ర‌వాత చాలా కాలం పాటూ భ‌ర్త మ‌ర‌యు పిల్ల‌ల బాగోగులు చూసుకున్నార‌ట‌. ఇక పిల్ల‌లు కాస్త పెద్ద‌వాళ్లు అయ్యాక‌. వీఎఫ్ఎక్స్ సంస్థ‌ను స్థాపించారు. షార్ట్ ఫిల్మ్స్ కు సంబంధించిన గ్రాఫిక్స్ ను ఈ సంస్థ‌లో రూపొందిస్తారు. అలా స్వాతి కూడా ఇప్పుడు సినిమాల‌కు ద‌గ్గ‌ర అయ్యింది.

ALSO READ :  ఉమామహేశ్వరి జీవితం లో అన్ని కష్టాలు అనుభవించారా….ఎన్టీఆర్ కూతురే అయినా చిత్ర హింసలు…!

Visitors Are Also Reading