Home » ఆ హిట్ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ జోడి..?

ఆ హిట్ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ జోడి..?

by Azhar
Ad

టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది హీరోలు రెండు కంటే ఎక్కువ సినిమాలనే లైన్ లో పెట్టుకొని ఉన్నారు. చిన్న హీరోల నుండి.. పెద్ద హీరోల వరకు.. యంగ్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు అందరి వద్ద చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. కానీ అందులో కొందరు మాత్రం ఒక్కే సినిమాతో సాగుతున్నారు. అలాంటి వారిలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా ఉన్నాడు.

Advertisement

కళ్యాణ్ రామ్ ఈ మధ్యే బింబిసారా అనే సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అధిక మొత్తంలో వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ అనేది ఉంది అని కళ్యాణ్ రామ్ ఎప్పుడో ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఆ సీక్వెల్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. తొందరలోనే కళ్యాణ్ రామ్ ఈ సినిమా షూటింగ్ అనేది ప్రారంభించబోతున్నాడు అనేది తెలిసిందే.

Advertisement

ఈ క్రమంలోనే బింబిసారా సీక్వెల్ తర్వాత కళ్యాణ్ రామ్ ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంపై క్లారిటీ అనేది తాజాగా వచ్చింది. కళ్యాణ్ రామ్ ఈ సీక్వెల్ సినిమా తర్వాత సంపత్ నందితో చేయబోతున్నాడు అని తెలుస్తుంది. చివరగా సంపత్ నంది గోపీచంద్ తో సిటిమార్ అనే సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ తో హత కట్టనున్నాడు అని సమాచారం.

ఇవి కూడా చదవండి :

వరల్డ్ కప్ లో వచ్చే పైసల్ కంటే కోహ్లీ పోస్టులకే ఎక్కువ..!

రోనాల్డోను మెచ్చుకున్న యువీ పరువు తీస్తున్న ఫ్యాన్స్..!

Visitors Are Also Reading