Home » బంగార్రాజు దర్శకుడుకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ గురించి తెలుసా….ఆ మంత్రి ఏమవుతారంటే..?

బంగార్రాజు దర్శకుడుకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ గురించి తెలుసా….ఆ మంత్రి ఏమవుతారంటే..?

by AJAY
Ad

సోగ్గాడే చిన్నినాయన సినిమా తో టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించారు. ఈ సినిమా రొమాంటిక్ కథాంశంగా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయగా సినిమా మంచి విజయం సాధించింది. మొదటి సినిమానే సూపర్ హిట్ గా నిలవడం తో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తరవాత కళ్యాణ్ కృష్ణ మరో అక్కినేని హీరో నాగ చైతన్య తో కలిసి రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను తెరకెక్కించారు.

Advertisement

ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. ఇక ఈ చిత్రం తరవాత ఏకంగా కళ్యాణ్ కృష్ణ మాస్ మహారాజ్ రవితేజ తో నేల టికెట్ సినిమా తీసే ఛాన్స్ అందుకున్నాడు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక తన మొదటి సినిమా సోగ్గాడే చిన్ని నాయన మంచి విజయం సాధించడంతో ఆ చిత్రానికి బంగార్రాజు అనే టైటిల్ తో సీక్వెల్ ను తెరకెక్కించాడు.

Advertisement

 

సినిమాలో నాగార్జున నాగచైతన్య హీరోలుగా నటించారు. రీసెంట్ గా సంక్రాంతి సంధర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రానికి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో ఈ చిత్రానికి మరో సీక్వెల్ కూడా చేస్తానని నాగార్జున ప్రకటించారు.

 

ఇదిలా ఉంటే కళ్యాణ్ కృష్ణ ఎవరో కాదు. ఏపీ మంత్రి కురసాల కన్నబాబు కు సొంత తమ్ముడు కావడం విశేషం. అంతే కాకుండా అందువల్లే బంగార్రాజు సినిమా కోసం ఏపీలో నైట్ కర్ఫ్యూ ను కూడా ఎత్తివేశారు అంటూ విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సినిమా టికెట్ల అంశం పై నాగార్జున సైలెంట్ గా ఉండటానికి కూడా రీజన్ అదే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading