సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ఎప్పుడు విడాకులు తీసుకంటారో చెప్పలేం. కొన్నేళ్లు డేటింగ్ చేసి ఆ తరవాత ఒకరిని విడిచిమరొకరు ఉండలేం అన్నట్టుగా మీడియా ముందు కనిపించిన సమంత నాగచైతన్యలు ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.
Advertisement
మరోవైపు మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ ఆమె భర్త హీరో కల్యాణ్ దేవ్ తో కూడా విడాకులు తీసుకుంటున్నట్టు గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి విడాకుల పై అధికారిక ప్రకటన ఇంకా వెలుబడలేదు కానీ ప్రస్తుతం ఇద్దరూ వేరు వేరుగానే ఉంటున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Advertisement
అంతే కాకుండా శ్రీజ సోషల్ మీడియాలో భర్తతో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో పాటూ అతడిని అన్ ఫాలో చేసింది. అంతే కాకుండా కల్యాణ్ దేవ్ సినిమాలకు అసలు మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ అందడం లేదు. ఈ నేపథ్యంలో శ్రీజ కల్యాణ్ దేవ్ విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోకముందే వాళ్ల మరో పెళ్లి పై కూడా వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందంటూ టాలీవుడ్ మీడియా గత కొద్దిరోజులుగా కోడై కూస్తోంది.
అంతే కాకుండా సంచలన జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటుందని జోష్యం చెప్పాడు. ఇక ఇప్పుడు కల్యాణ్ దేవ్ కూడా మూడో పెళ్లికి రెడీ అవుతున్నాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. కల్యాణ్ దేవ్ శ్రీజ కంటే ముందే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్ట టాక్. అంతే కాకుండా కల్యాణ్ దేవ్ ఈసారి తన మరదలినే పెళ్లాడబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలి అంటే కల్యాణ్ దేవ్ స్పందిచాల్సిందే.