Telugu News » Blog » జీవితంలో చేసిన ఆ ఒక్క త‌ప్పు వ‌ల్ల ఆస్తుల‌న్నీ కోల్పోయిన హీరోయిన్ క‌ల్యాణి….? ఆ త‌ప్పు ఏంటంటే..?

జీవితంలో చేసిన ఆ ఒక్క త‌ప్పు వ‌ల్ల ఆస్తుల‌న్నీ కోల్పోయిన హీరోయిన్ క‌ల్యాణి….? ఆ త‌ప్పు ఏంటంటే..?

by AJAY
Ads

గ్లామ‌ర్ ఫీల్డ్ లో ఉన్న‌వాళ్లకు ఫాలోయింగ్ తో పాటూ కాసుల వ‌ర్షం కూడా కురుస్తుంది. సినిమాల్లో సక్సెస్ అయ్యారంటే చాలా సినిమాలు, వ్యాపార‌ప్ర‌క‌ట‌న‌లు షాప్ ఓపెనింగ్ లు ఇలా డ‌బ్బు సంపాదిచడానికి ఎన్నో దారులు ఉంటాయి. అయితే అలా సంపాదించుకున్న డ‌బ్బుల‌ను జాగ్ర‌త్త‌గా దాచుకోవ‌డ‌మో లేదా వ్యాపారాల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డ‌మో చేయాలి. అంతే కాకుండా ఆచి తూచి అడుగులు వేయాలి లేదంటూ క‌ష్టాలు త‌ప్పవు.

Ads

ఇక టాలీవుడ్ లో హీరోయిన్ లుగా రాణించిన కొంత‌మంది చిన్న చిన్న త‌ప్పుల వ‌ల్ల ఆస్తులను కోల్పోవ‌డంతో పాటూ సినిమాల‌కు కూడా దూరం అయ్యారు. అలాంటి హీరోయిన్ ల లిస్ట్ లో క‌ల్యాణి కూడా ఉన్నారు. అవును వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు, క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ సినిమాల‌తో క‌ల్యాణి టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు సాధించారు. ఈ రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ఇక క‌ల్యాణి స‌త్యం సినిమా డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్ ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Ads

పెళ్లి త‌ర‌వాత క‌ల్యాణి సినిమాల్లో న‌టించ‌డం త‌గ్గించారు. సూర్య‌కిర‌ణ్ క‌ల్యాణి లు సొంతంగా చాప్ట‌ర్ 2 సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా వ‌ల్ల సూర్య‌కిర‌ణ్ క‌ల్యాణిలు త‌మ ఆస్తుల‌న్ని పోగొట్టుకున్నారు. ఆ త‌ర‌వాత క‌ల్యాణి భ‌ర్త సూర్య‌కిర‌ణ్ తో విడిపోయారు. బిగ్ బాస్ త‌ర‌వాత సూర్య‌కిర‌ణ్ ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో క‌ల్యాణి గురించి చెబుతూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక క‌ల్యాణి సినిమాల‌కు దూరం అవ్వడానికి ఆస్తులు కోల్పోవ‌డానికి కార‌ణం ఏంట‌నేది వారి బంధువు రాజుగారిగ‌ది సినిమా న‌టుడు చేత‌న్ వెల్ల‌డించారు. క‌ల్యాణి చాప్ట‌ర్ 2 సినిమా వ‌ల్ల‌నే ఆస్తుల‌న్నీ కోల్పోయార‌ని చెప్పారు. ఆ కార‌ణం వ‌ల్ల‌నే సూర్య‌కిర‌ణ్ తో కూడా విడిపోయార‌ని అన్నారు. అంతే కాకుండా రీఎంట్రీకి సిద్ద‌మైనా కూడా మంచి క‌థ‌ల కోసం వెయిట్ చేస్తున్నార‌ని చెప్పారు.

Ad

ALSO READ : కార్తికేయ స‌క్సెస్ ను జీర్ణించుకోలేక‌పోతున్న చార్మి…ప‌రోక్షంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!