టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు వరుసగా మరణిస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. కృష్ణ మరణం మరిచిపోకముందే మరో దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరణించాడు. నవరస నటనా సార్వభౌముడిగా పేరు పొందిన, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణాన్ని తెలుగు సినీ పెద్దలతో పాటు అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ ఫిల్మ్ నగర్ లోని తన నివాసం ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Advertisement
కృష్ణ జిల్లా కౌతవరంలో 1935 జులై, 25 పుట్టారు. గుడ్లవల్లేరులో ప్రాథమిక విద్య, గుడివాడలో కళాశాల విద్యనభ్యసించారు. కళాశాలలో చదువుతున్న రోజుల నుంచే ఆయనకు నాటకాలంటే చాలా ఇష్టం. విజయవాడ హనుమంత రాయ గ్రంథాలయంలో నాటక పోటీలలో పాల్గొనే వారు. 1952లో ఆచార్య ఆత్రేయ రాసిన నాటకం ఎవరు దొంగ ను ప్రదర్శించారు కైకాల. ఆ నాటకాన్ని చూసిన సినీ దర్శకుడు గరికపాటి రాజారావు సినిమాల్లోకి రావాలని.. ఆహ్వానించారంట. ఇడ్లీ పూర్తి చేసిన తర్వాత మద్రాస్ కి వెళ్లి ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారట. దేవదాస్ నిర్మాత రియల్ నారాయణ చందమామ బ్యానర్ పై నిర్మించిన సిఫాయి కూతురు చిత్రంలో నటించారు సత్యనారాయణ. చంగయ్య దర్శకత్వంలో నటి జమున సరసన హీరోగా తెరపై కనిపించారు.
Advertisement
వాస్తవానికి అదే మొదటి సినిమా కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. ఎన్టీఆర్కు దగ్గర పోలికలు ఉండడంతో సత్యనారాయణ ఖాళీగా ఉండకుండా ఎన్టీఆర్కు డూప్ గా చాలా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తో కలిసి దాదాపు నూట ఒక చిత్రాల్లో నటించారు కైకాల. ఎన్టీఆర్ రాముడు భీముడు చిత్రంలో ఎన్టీఆర్ ది పాత్ర అభినయం చేశాడు అందులో ఎన్టీఆర్కు దూపుగా తన సామర్థ్యం ఏంటో నిరూపించుకున్నారు. సినీ దర్శకుడు ఎస్డి లాల్ విఠలాచార్య సత్యనారాయణకు హీరో వేషాల కోసం వేచి చూడకుండా విలన్ పాత్రలో నటించమని సలహా ఇచ్చాడట.
Also Read : Kaikala sathyanarayana: పాపం కైకాల ఆ చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారా..?
విఠలాచార్య ఇచ్చిన సలహాను స్వీకరించారు సత్యనారాయణ. సత్యనారాయణ నటించిన చివరి చిత్రం మహర్షి. దాదాపు 200 మంది దర్శకులతో పనిచేశారు కైకాల సత్యనారాయణ. వారి కుటుంబం చిత్రానికి గాను నంది అవార్డు అందుకున్నారు. 2014లో రఘుపతి వెంకయ్య అవార్డును, 2017లో జీవన సాఫల్య పురస్కారాన్ని దక్కించుకున్నారు. పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద చిత్రాల్లో ఎన్నో పాత్రలో నటించిన సత్యనారాయణ.. 28 పౌరాణిక 501 జానపద 9 చారిత్రక చిత్రాల్లో నటించారు. రమా ఫిలిం ప్రొడక్షన్ సంస్థను స్థాపించి కొదమ సింహం బంగారు కుటుంబం ముద్దుల మొగుడు వంటి చిత్రాలను నిర్మించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల టిడిపి అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
Also Read : కైకాల సత్యనారాయణ ఆస్తులు విలువ ఎంతో తెలుసా..? ఎన్ని కార్లు, బంగ్లాలు ఉన్నాయంటే !