Home » కైకాల సత్యనారాయణ ఆస్తులు విలువ ఎంతో తెలుసా..? ఎన్ని కార్లు, బంగ్లాలు ఉన్నాయంటే !

కైకాల సత్యనారాయణ ఆస్తులు విలువ ఎంతో తెలుసా..? ఎన్ని కార్లు, బంగ్లాలు ఉన్నాయంటే !

by Bunty
Ad

టాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తాజాగా కన్నుమూశారు. ఫిల్మ్ నగర్ లోని నివాసంలో తుది శ్వాస విడిచారు కైకాల సత్యనారాయణ. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల ఇవాళ ఉదయం 4 గంటలకు మరణించినట్లు సమాచారం అందుతుంది.
ఇది ఇలా ఉండగా, కైకాల సత్యనారాయణ నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. పరిశ్రమలో సంపాదించిన డబ్బులు పరిశ్రమలోనే పెట్టుబడి పెట్టారు. రమా ఫిలిమ్స్ పేరిట గజదొంగ, ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి చిత్రాలు నిర్మించారు.


అలాగే తన ఇద్దరు కొడుకులను సత్యనారాయణ పరిశ్రమకు దూరంగా పెంచారు. సాధారణంగా నటుల వారసులు నటులు కావాలి అనుకుంటారు. సత్యనారాయణ కొడుకులు, కూతుర్లు సినిమా ప్రపంచంలోకి రాలేదు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 1 సత్యనారాయణ కుమారుల్లో ఒకరు తెలుగులో విడుదల చేశారు. సత్యనారాయణ కుమారులు ఇద్దరు వ్యాపారస్తులుగా స్థిరపడ్డారని సమాచారం. ఏనాడు మీడియా ముందుకు రాని వీరి గురించి ప్రపంచానికి ఏమీ తెలియదు. సినిమాను కలగా చూసిన కైకాల సత్యనారాయణ పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదు. వందల చిత్రాల్లో నటించినప్పటికీ ఆయన సంపాదించింది తక్కువే అని తెలుస్తుంది.

Advertisement

Advertisement

గత ఏడాది కైకాల తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయన ఆసుపత్రి ఖర్చులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేశారు. కైకాల సత్యనారాయణకు రెండు కార్లు ఉన్నాయి. దాదాపు రూ. 67 లక్షల విలువ చేసే మెర్సీడేజ్ బెంజ్ జి ఎల్ సి క్లాస్ కారు ఉంది. అలాగే ఒక టయోటా ఇన్నోవా క్రిస్టా కారు ఉంది. దాని ధర రూ. 29 లక్షలు అని సమాచారం. సత్యనారాయణ కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున రెసిడెన్సి గచ్చిబౌలిలో గల ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటి ధర రూ. 1.5 కోట్లు ఉండొచ్చు. అంతకుమించి కైకాల సత్యనారాయణ కు సంబంధించిన ఆస్తుల వివరాలపై పెద్దగా సమాచారం లేదు.

READ ALSO : Kaikala Satyanarayana : కైకల యుముడిగా చేసిన సినిమాలు ఇవే

Visitors Are Also Reading