Telugu News » Blog » కేసీఆర్ ను చిత్తు చిత్తుగా ఓడిస్తా… సీఎం పై కేఏ పాల్ ఫైర్….!

కేసీఆర్ ను చిత్తు చిత్తుగా ఓడిస్తా… సీఎం పై కేఏ పాల్ ఫైర్….!

by AJAY
Ads

ప్రముఖ క్రైస్తవ మతగురువు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ విదేశాల్లో ఉంటున్నా భారత రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏపీ తెలంగాణ లో సమస్యలపై స్పందిస్తూ ఉంటారు. గతంలో ఏపీలో ప్రజశాంతి పార్టీ తరపున పోటీ చేయగా ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయారు. ఇక తాజాగా కేఏ పాల్ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Advertisement

నేడు గవర్నర్ తమిళ సై ను కలిసిన అనంతరం కే ఏ పాల్ మాట్లాడుతూ……కేసీఆర్ పాలన అవినీతి మయం అన్నారు. ఏడేళ్ల లో ఏడు లక్షల కోట్లు దోచుకున్నారు అని ఆరోపించారు. కేసిఆర్ అక్రమ పాలనను అంతం చెయ్యడానికి తాను అమెరికా నుండి వచ్చా అని చెప్పారు. టీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఒడిస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కి 30 సీట్లకు మించి ఎక్కువ రావని ప్రశాంత్ కిషోర్ చెప్పారన్నారు. కేసీఆర్ ను త్వరలోనే సీబీఐ అరెస్ట్ చేస్తుంది అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ పాలనలో విఫలం అయ్యారు అంటూ విమర్శలు కురిపించారు.