సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఇవాళ పదవీ విరమణ పొందారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా సుప్రీంకోర్టు ప్రోసిడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ రాజకీయ పార్టీల ఉచిత హామీలపై విచారణ ప్రారంభించారు. పదవీ విరమణ చివరి రోజు కీలక తీర్పును వెల్లడించారు. ప్రధానంగా రాజకీయ పార్టీల ఉచిత హామీలపై పలు సూచనలు చేసిన జస్టిస్ ఎన్వీరమణ ఇప్పటికే త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ త్రిసభ్య ధర్మాసనాన్ని కొత్త సీజేఐ ఉదయ్ ఉమేష్ లలిత్ ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. దీంతో పాటు అఖిలపక్షం, నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని తీర్పు ఇచ్చారు.
ఆ తరువాత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీజేఐగా లలిత్‌తో ప్రమాణం చేయించారు. ఇక న్యాయవాదిగా జస్టిస్ లలిత్ ప్రస్థానం చూస్తే చాలా ఇన్‌స్పిరేటివ్ గా ఉంటుంది. గ్రౌండ్ లెవల్ నుంచి ఎదిగొచ్చి అత్యున్నత పీఠం అధిష్టించిన నేపథ్యం ఆయనది. ముంబై గవర్నమెంట్ లా కళాశాల నుంచి గ్రాడ్యుయేట్ తీసుకు్న జస్టిస్ లలిత్.. 1983లో బాంబే, గోవాలో అడ్వకేట్‌గా ఎన్‌రోల్ అయ్యారు. బాంబే హై కోర్టులో రెండేళ్లు ప్రాక్టీస్ చేశారు. 1986 జనవరిలో తన ప్రాక్టీస్‌ని ఢిల్లీకి మార్చారు. 2004లో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా గుర్తించింది.
Advertisement
Advertisement
ఇవి కూడా చదవండి : పారిపోయిన యూట్యూబర్.. అతని ఆచూకి చెప్పిన వారికి రూ.25వేల రివార్డ్..!
2011లో 2జీ స్ప్రెక్టం కేసులో సీబీఐ తరుపున వాదనలు వినిపించారు. 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. బార్ నుంచి నేరుగా సీజేఐగా నియమితులైన వ్యక్తుల్లో జస్టిస్ లలిత్ రెండవ వ్యక్తి. న్యాయమూర్తిగా కూడా జస్టిస్ లలిత్‌కి మంచి రికార్డే ఉంది. ట్రిపుల్ తలాక్ వంటి కీలక కేసుల్లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఇచ్చిన బెంచ్‌ల్లో జస్టిస్ లలిత్ భాగస్వామ్యం ఉంది. 2017లో విజయ్ మాల్యాకి నాలుగు నెలల జైలు శిక్ష విధించిన బెంచ్‌లో కూడా జస్టిస్ లలిత్ కూడా ఒకరు. ప్రస్తుతం సీజేఐగా కూడా ఆయన పలు కీలక కేసుల విచారణ చేపట్టబోతున్నారు. 490 పెండింగ్ కేసుల పరిష్కారం కోసం నూతన ధర్మాసనాలను ఏర్పాటు చేసే అవకాశముంది.
ఇవి కూడా చదవండి : కొరటాల స్టార్ డైరెక్టర్ అవ్వడానికి సింహా సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? ఆ మోసం తరవాతే..?