Home » బాలకృష్ణపై జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ అలాంటి కామెంట్స్ చేసిందా ?

బాలకృష్ణపై జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ అలాంటి కామెంట్స్ చేసిందా ?

by Anji
Ad

పాయల్ ఘోష్.. ఈ బాలీవుడ్ నటి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఈ బ్యూటీ మంచు మనోజ్ తో కలిసి ప్రయాణం, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఊసరవెల్లి వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. అయితే ఈమె ఎక్కువగా తెలుగులో సినిమాలు చేయలేదు. నార్త్ అమ్మాయి కావడంతో హిందీ సీరియల్స్, బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కానీ ఆమెకు నార్త్ కంటే సౌత్ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుందని పలుమార్లు వెల్లడించింది. ఈమె చివరగా 2017లో ఓ హిందీ సినిమాలో కనిపించింది.

Advertisement

ఇక ఆ తరువాత సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మూత్రం యాక్టివ్ గా ఉంటుంది. రాజకీయ పార్టీలో చేరి రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది పాయల్ ఘోష్. ఈమె కాస్టింగ్ కౌచ్ గురించి గం విప్పిన విషయం విధితమే. ఓ దర్శకుడు తనను లైంగికంగా వేధించడని షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. తాజాగా నందమూరి బాలకామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. అయితే ఈమె తాజాగా నందమూరి బాలకృష్ణ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Advertisement

బాలయ్య ఇటీవల భగవంత్ కేసరి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్  చేసింది పాయల్. బాలకృష్ణ సార్ ఈ వయసులో కూడా సూపర్ హిట్ సినిమాలు ఇస్తున్నారు. టాలీవుడ్ నటనను చూసి బాలీవుడ్ యాక్టర్స్ నేర్చుకోవాలి” అని ట్వీట్ చేసింది. దీంతో ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె గతంలో పలువురు నటీనటులు, బాలీవుడ్ పై కూడా ఇలానే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  పాయల్ చేసిన వ్యాఖ్యలపై ఎవరైనా బాలీవుడ్ లో స్పందిస్తారేమో వేచి చూడాలి మరి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading