తిరుమలలో మంత్రి అప్పలరాజు హల్ చల్ చేశారు. మంత్రి అనుచరులతో కలిసి తిరుమల చేరుకున్నారు. అందరికీ ప్రోటోకాల్ దర్శనం కల్పించాలని ఒత్తిడి తేవడం తో టీటీడీ తలొగ్గింది. దాంతో 140 మంది అనుచరులకు ప్రోటోకాల్ దర్శనం జరిగింది.
Advertisement
సీఎం చంద్రబాబు నేడు పోలవరం విలీన మండలాల పర్యటనకు బయలు దేరుతున్నారు. చంద్రబాబు. ఇవాళ, రేపు వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా మూసారాంబాగ్ బ్రిడ్జిపై భారీగా బురద, చెత్త, రాళ్లు పేరుకుపోయాయి. రాత్రి నుంచి వరద తగ్గడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
రంగారెడ్డి రాజేంద్రనగర్ హసన్ నగర్ లో ఆకతాయిలు రెచ్చిపోయారు. హలీమ్ అనే యువకుడిపై కత్తులతో దాడి చేశారు. విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చెరువులో పడేసి దుండగులు పారిపోయారు.
భద్రాచలం వద్ద గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. 39.40 అడుగుల వద్ద వరద స్థిరంగా కొనసాగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరికకు దిగువలోనే గోదావరి ప్రవాహం
ఉంది.
Advertisement
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో ఠాగూర్, రేవంత్, భట్టి, ఉత్తమ్ భేటీ అయ్యారు. పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లు కేటాయించాలని…. విద్యార్థులు అడ్మిషన్ల కోసం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలనీ పేర్కొంది. లాటరీ విధానంలో సీట్ల కేటాయింపు జరగనుంది.
ఇరాక్ పార్లమెంట్ లోకి ఆందోళన కారులు దూసుకువచ్చారు. ప్రధాని అభ్యర్థి గా మహ్మద్ అల్ సుడానిని ఎంపిక చేయగా ఇరాన్ మద్దతు పార్టీలు అతడిని బల పరిచాయి అంటూ ఆందోళన చేస్తున్నారు.
తెలంగాణలో వచ్చే నెల నుండి గర్భిణీ లకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.