Home » July 16th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

July 16th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఈరోజు మధ్యాహ్నం బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం కానుంది. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.

భద్రాచలం వద్ద గోదావరి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఉదయం 5 గంటల నుంచి గోదావరి ప్రవాహం రెండు పాయింట్లు తగ్గిందని అధికారులు వెల్లడించారు.

Advertisement

నేడు శ్రీలంక పార్లమెంట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశం లో కొత్త అధ్యక్షుడి ఎన్నికపై చర్చ జరగనుంది.

ఇంగ్లండ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డ్‌స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దాంతో బ్రిటన్ వాతావరశాఖ తొలిసారి రెడ్‌ వార్నింగ్‌ జారీ చేసింది.

తెలంగాణ విద్యార్ధి వేదిక నేత గోపీ అరెస్ట్ అయ్యారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. 2019లో నమోదైన మావోయిస్టు కేసులో గోపీ ఏ60గా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Pawan kalyan

Pawan kalyan

నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. మండపేటలో కౌలురైతు భరోసా యాత్రలో పాల్గొని ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించనున్నారు

ఉన్నత విద్యాసంస్థలకు కేంద్ర ప్రభుత్వం ర్యాంకింగ్స్ ప్రకటించింది. దేశంలో 14వ స్థానంలో ఐఐటీ హైదరాబాద్ నిలిచింది. 20వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్…45వ స్థానంలో వరంగల్ నిట్, 46వ స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి.

రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. గతంలో పరీక్ష సమయం 3గంటలు ఉండగా ఇప్పుడు 20నిమిషాలు పెంచారు.

దేశంలో తొలి మంకీ ఫాక్స్ కేసు నమోదు అవ్వడంతో ఆరోగ్య అధికారులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్ లో మంకీ ఫాక్స్ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

సీఎం కేసీఆర్ నేడు టీఆర్ఎస్ ఎంపీ లతో సమావేశం కానున్నారు. ఈ నెల 18 నుండి పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Visitors Are Also Reading