Home » 25 ఏళ్ల ‘ ఎన్టీఆర్ బాల రామాయ‌ణం ‘ గురించి మీకు ఈ ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు తెలుసా…!

25 ఏళ్ల ‘ ఎన్టీఆర్ బాల రామాయ‌ణం ‘ గురించి మీకు ఈ ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు తెలుసా…!

by Azhar
Ad

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ విజయాన్ని ఆస్వాదిస్తున్న యాంగ్ టైగర్ ఎన్టీఆర్.. నటనలో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు పొందాడు. అయితే 2000 ఏడాదిలో వచ్చిన ‘నిన్ను చూడాల‌ని’ అనే సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయమైనా జూ. ఎన్టీఆర్ అంతకుముందే బాలనటునిగా కొన్ని సినిమాల్లో నటించారు. అలా ఎన్టీఆర్ బాల నటునిగా కనిపించిన మొదటిసినిమా బాల రామాయ‌ణం. అయితే ఈ సినిమా విడుదలై నేటికీ సిల్వర్ జూబ్లీ. దాంతో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాన్ని ప్రస్తుతం నెత్తిన వైరల్ గా మారాయి.

Read More: అతియాను నిరాశకు గురిచేసిన రాహుల్..

Advertisement

Advertisement

ఈ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్ న‌టించ‌గా… సీత‌గా స్మితా మాధ‌వ్… నారాయ‌ణం నిఖిల్ ల‌క్ష్మ‌ణుడిగా కనిపించారు. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి వారం జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో సినిమా ప్లాప్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత… ఇందులో నటించింది ఎన్టీఆర్ మనవడు అని జనాలకు తెలియడంతో మెల్లిగా సినిమాకు రావడం ప్రారంభించారు. అలాగే ఇందులో ఎన్టీఆర్ నటన కూడా అభిమానులకు తెగ నచ్చింది.

1997లో భార‌తీయ జాతీయ చ‌ల‌న చిత్ర పుర‌స్కారాల్లో ఉత్త‌మ బాల‌ల సినిమాగా ఎంపికైన ఈ సినిమా థియేటర్లలో కూడా 100 రోజులు పూర్తి చేసుకొని ఎన్టీఆర్ ఖాతాలో మొదటి విజయాన్ని నమోదు చేసింది. గుణ‌శేఖ‌ర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎంఎస్‌. రెడ్డి నిర్మాతగా వ్యవరించారు.

Visitors Are Also Reading