Home » Jr: NTR ఇంట్లో తారకరత్న ఫోటోతో పాటు మరో హీరో ఫోటో.. ఎవరిదంటే..?

Jr: NTR ఇంట్లో తారకరత్న ఫోటోతో పాటు మరో హీరో ఫోటో.. ఎవరిదంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నందమూరి యంగ్ హీరో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా నందమూరి అభిమానులతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయాల్ముకున్నాయి.. నారా లోకేష్ మొదలుపెట్టిన యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటు గురై నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో 23 రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చివరికి ప్రాణాలు విడిచారు తారకరత్న. ఈయన ప్రాణాలను బతికించేందుకు వైద్యులు ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు.

Advertisement

చివరికి ప్రాణాలు పోయాయి. ఆయన మరణ వార్త విన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తారక రత్నకు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం అందరికీ తెలుసు. తమ్ముడు తమ్ముడు అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారట తారకరత్న. అయితే తాజాగా ఎన్టీఆర్ ఇంట్లో తారకరత్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలతో పాటుగా మరో స్టార్ ఫోటోలు కూడా అక్కడే ఉన్నాయి. ఎన్టీఆర్ ఇంట్లో ఒక గోడకు తారకరత్న ఫోటో అలాగే కింద హీరో పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు కనిపిస్తున్నాయి.

Advertisement

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంటర్ చేసిన తారకరత్న అటు ఇండస్ట్రీలో ఇటు ఇటు తన కుటుంబంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా కలిసిపోతు ఉండేవారట. అలాంటి తారకరత్న లేడనే నిజాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖులు అంతా వచ్చి ఫిల్మి చాంబర్లో ఆయనకు నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన చనిపోయి ఇన్ని రోజులైనా సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తతో వైరల్ అవుతూనే ఉన్నారు.

also read:

Visitors Are Also Reading