Home » బట్లర్ క్రీడాస్ఫూర్తికి అభిమనులు ఫిదా…!

బట్లర్ క్రీడాస్ఫూర్తికి అభిమనులు ఫిదా…!

by Azhar
Ad

క్రికెట్ లో ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని చాలా రకాలుగా చాటుకుంటారు. ఆటగాళ్లు అలా చేసిన సమయంలో వారు అభిమానుల మనసులను గెలుచుకుంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022 లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ చేసిన పనిని అభిమానులు మెచ్చుకుంటున్నారు. మన ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసిన అత్యధిక రెడ్ క్యాప్ ఇస్తారు అనే విషయం తెలిసిందే.

Advertisement

ఈ ఐపీఎల్ 2022 లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగటానికి ముందు వరకు జోస్ బట్లర్ అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను కలిగి ఉన్నాడు. ఇక ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్… త్వరగా వికెట్లు కోల్పోవడంతో బ్యాటింగ్ కు వచ్చిన జట్టు కెప్టెన్ పాండ్య… 52 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 87 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతను ఐపీఎల్ సీజన్లో బట్లర్ కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Advertisement

గుజరాత్ బ్యాటింగ్ 19వ ఓవర్లలో ఈ ఘటన జరగగా.. అప్పటివరకు ఆరెంజ్ క్యాప్ ధరించి ఫిల్డింగ్ చేస్తున్న బట్లర్.. తాను దానికి అర్హుడిని కాదని క్యాప్ ను తీసేసాడు. ఆ సమయంలో బట్లర్ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి అభిమానులను కట్టి పడేసింది. అయితే ఆ తర్వాత రాజస్థాన్ బ్యాటింగ్ చేయగా… 24 బంతుల్లో 54 పరుగులు చేసిన బట్లర్ మళ్ళీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. ఇక ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో బట్లర్ 272 పరుగులతో మొదటి స్థానంలో ఉంటె.. 228 పరుగులతో పాండ్య రెండో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి :

అద్భుతమైన ఘటన ఒక్కే జట్టులో ఇండియా, పాకిస్థాన్ ఆటగాళ్లు…!

ఆర్సీబీ టైటిల్ గెలిచే వరకు పెళ్లి చేసుకోను.. అయితే అంతే సంగతి..!

Visitors Are Also Reading