బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ అనేక మలుపులు తిరుగుతోంది. ఈ పార్టీపై మెరుపు దాడులు చేసిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి వీడియోలు ఫోటోలను కొంతమంది సినీ ప్రముఖులు కనపడటంతో వారి పేర్లను మీడియాలో బహిర్గతం చేశారు. అలా బయటకు వచ్చిన పేర్లలో జనసేన పార్టీ నేత ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉన్నారు. తనతో పాటు జనసేనని కామెంట్లు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వీడియో తో క్లారిటీ ఇచ్చారు.
Advertisement
బెంగళూరు రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. గత రెండు రోజులుగా హైదరాబాదులో ఉన్న వాళ్ళ మధ్యలో తీరిక లేకుండా వ్యక్తిగత పనులతో బిజీగా ఉన్నాను. నేను ఎవరితో ఎక్కడ ఏదో కనిపించానని పుకార్లు వస్తున్నాయని జనసేన పార్టీని జనసేన ని ఉద్దేశించి నోటికొచ్చినవి రాస్తున్నారని అన్నారు. ఆదివారం తెలుగు సినిమా పరిశ్రమ ఘనంగా జరిపిన డైరెక్టర్స్ డే ఈవెంట్లో పాల్గొన్నాను. సోమవారం నా స్నేహితుడిని కలవడానికి హాస్పిటల్ కి వెళ్ళాను.
Also read:
Advertisement
Also read:
ఇప్పటిదాకా నేను అసోసియేషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని నేను బెంగళూరులో ఎలా ప్రత్యక్షమయ్యాను. ఎలా ఈ వార్త పుట్టుకొచ్చిందో తెలియదని అన్నారు. ఏదైనా సూటిగా నేరుగా ఎదుర్కొనే వాళ్ళు చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు అని అన్నారు. నేను ఏదో తప్పు చేసి తప్పిపుచ్చుకోవడానికి వివరణ ఇవ్వట్లేదు అని, నాపై దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకు కౌంటర్ ఇవ్వడానికి కాదని, నన్ను వాళ్లలో ఒక కుటుంబ సభ్యున్ని అనుకునే వాళ్ళ కోసం ఈ వివరణ ఇస్తున్నానని ఈ వీడియోని పోస్ట్ చేశారు. జానీ మాస్టర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!