మనం ఇప్పటి వరకు ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్, కమెడియన్లు,దర్శకనిర్మాతల ఆస్తులు, విలాసవంతమైన బంగ్లాలు, కార్లు వంటివి చూసాం.. కానీ ఇండస్ట్రీలో ఉండే ఈ డాన్స్ మాస్టర్ ఆస్తుల విలువ తెలిస్తే అంతా ఆశ్చర్యపోతాం.. మరి ఆయనెవరో చాలా పేరు పొందిన శేఖర్ మాస్టర్ అనుకుంటే తప్పే.. ఆయన తర్వాత వరుసలో ఉండే జానీ మాస్టర్.. జానీ మాస్టర్ కు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట.. అవేంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో శేఖర్ మాస్టర్ తర్వాత గుర్తుకొచ్చే డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ అని చెప్పవచ్చు. ఎలాంటి కఠినమైన మూమెంట్స్ అయినా ఈజీగా చేయగలరు. అందుకే పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది.
Advertisement
ఆయన తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా తమిళ్, కన్నడ,హిందీ ఇండస్ట్రీలో కూడా చేస్తున్నారు. ఈ టీవీ డాన్స్ షో “ఢీ “తో ఆయన డాన్సర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. 2003లో ద్రోణ మూవీ కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ వచ్చింది. ఆతర్వాత 2012లో రచ్చ సినిమా కొరియోగ్రఫీ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఓ రేంజ్ లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అంటే చాలా ఇష్టమట. అలాగే 2014లో సల్మాన్ ఖాన్ నటించిన జయహో సినిమాకి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేశారు. రామ్ హీరోగా వచ్చిన ఈస్మార్ట్ శంకర్ లో టైటిల్ సాంగ్ కూడా జానీ మాస్టర్ చేశారు. అలాగే అల వైకుంఠ పురం సినిమాలో బుట్ట బొమ్మ పాట తో కూడా క్లాస్ స్టెప్పులు వేయించారు. ఇదంతా పక్కన పెడితే ఆయనకు తన భార్య డెలివరీ సమయంలో ఒక్క రూపాయి కూడా చేతిలో లేదట.
Advertisement
also read:అర్ధరాత్రి 12:ఎన్టీఆర్+ జయలలిత..అమ్మ బాబోయ్ అంత పని చేశారా..?
ఆమెను ఆసుపత్రిలో చేర్పిస్తే బిల్లు 5 లక్షల వరకు అయిందని, దీంతో కట్టడానికి డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విషయం రామ్ చరణ్ కి తెలియడంతో రామ్ చరణ్ ఉపాసన కలిసి బిల్ పే చేశారని అన్నారు. అది కూడా తనకు తెలియకుండానే పే చేశారని తెలియజేశారు. నేను డబ్బు కోసం ప్రయత్నించే సమయంలో హాస్పిటల్ వాళ్ళు వచ్చి మూడు వందల బిల్ కట్టాలని చెప్పడంతో నేను షాక్ అయ్యానని, బిల్ ఎవరు కట్టారో ఆరా తీస్తే రామ్ చరణ్ ఉపాసన కట్టారని తెలిసిందని అన్నారు. ఇక ఆ తర్వాత జానీ మాస్టర్ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఒక్కో సినిమాకి రెమ్యూనరేషన్ 20 నుంచి 30 లక్షల వరకు తీసుకుంటున్నారు. స్పెషల్ సాంగ్స్ అయితే 10 లక్షల వరకు తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తానికి ఆయన ఆస్తులు బాగానే సంపాదించారని హైదరాబాద్ బెంగళూరు లో దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టుకున్నట్టు సమాచారం.
also read: