నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. సరిహద్దు భద్రతా దళం పలు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో భాగంగా ఉండే ఈ విభాగంలో భారీగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు కింద ఉన్నాయి. మీరు కూడా తెలుసుకోండి.
Advertisement
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు…
నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 1284 కానిస్టేబుల్ (ట్రేడ్స్ మెన్) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పురుషులు (1220), మహిళలు (64) ఉన్నాయి. కోబ్లర్, టైలర్, వాషర్మన్, బార్బర్, స్వీపర్, కుక్, వెయిటర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్/ పదోతరగతి/ తత్సవాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
Advertisement
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 27-03-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
READ ALSO : TS Lawcet: లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..!