Home » ఇదేందయ్యా ఇది ! జీవా ఇలా అనేసావ్ మా జగనన్న ఫ్యాన్స్ హర్ట్ అవుతారు మరి !

ఇదేందయ్యా ఇది ! జీవా ఇలా అనేసావ్ మా జగనన్న ఫ్యాన్స్ హర్ట్ అవుతారు మరి !

by Anji
Published: Last Updated on
Ad

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా యాత్ర సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా యాత్ర2 సినిమా రాబోతుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 08, 2024న విడుదల కానుంది. ఈ సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జీవా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Jeeva look in Yatra 2

Jeeva look in Yatra 2

 

2001లో ఆనందం సినిమా కోసం మమ్ముట్టిని కలిశానని వెల్లడించారు. దాదాపు 20 ఏళ్ల తరువాత ఇప్పుడు యాత్ర 2 సినిమా సెట్స్ లో ఇప్పుడు మమ్ముట్టిని కలిశానని కామెంట్స్ చేశారు జీవా. మమ్ముట్టి చాలా సరదా మనిషి అని చెప్పుకొచ్చాడు జీవా. యాత్రలో వైఎస్సార్ పాత్రలో నటించిన మమ్ముట్టిని ఎలాంటి సమస్యను ఎదుర్కోలేదా..? అని అడిగినట్టు తెలిపారు.

Advertisement

Advertisement

ఆ సమయంలో మమ్ముట్టి ఏ సమస్య ఏం సమస్యని మనం కేవలం నటులం మాత్రమేనని చెప్పారని జీవా  తెలిపారు. వచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళ్లాలని ఆయన చెప్పుకొచ్చారని జీవా పేర్కొన్నారు. మమ్ముట్టి నాతో ఒక వ్యక్తి పాత్ర పోషించినంత మాత్రాన ఆయనకో, ఆయన పార్టీకో మద్దతు తెలిపినట్టు కాదని చెప్పారని జీవా కామెంట్లు చేశారు. మమ్ముట్టి చెప్పిన మాటలను ఎప్పటికీ మరిచిపోలేనని అభిప్రాయం వ్యక్తం చేశారు జీవా.

మమ్ముట్టి అభిప్రాయమే తన అభిప్రాయం అని జీవా వెల్లడించారు. ఫిబ్రవరి 8న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading