Home » Jigarthanda Double X Movie Review : జిగర్తాండ డబుల్ ఎక్స్ రివ్యూ…!

Jigarthanda Double X Movie Review : జిగర్తాండ డబుల్ ఎక్స్ రివ్యూ…!

by Bunty

 

డైరెక్టర్ కమ్ యాక్టర్ యస్.జె.సూర్య, రాఘవ లారెన్స్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం జిగర్తాండ డబుల్ ఎక్స్. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అంతకుముందు పిజ్జా, జిగర్తాండ చిత్రాలతో ఫేమస్ అయిన కార్తీక్ ఇప్పుడు జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలు రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం 2015 సూపర్ హిట్ చిత్రం జిగర్తాండ కి సీక్వెల్.

Jigarthanda Double X Movie Review

కథ మరియు వివరణ :
జిగర్తాండ డబుల్ ఎక్స్ కథ విషయానికి వస్తే.. ముందుగా ఈ సినిమా కథ గురించి తెలుసుకుంటే 1975 సంవత్సరంలో ఒక థియేటర్ దగ్గర ఒక రౌడీ (లారెన్స్) కి జరిగిన గొడవ వల్ల అతను హీరోగా మారాలి అనుకుంటాడు. అయితే ఆయన చూడడానికి చాలా నల్లగా, అసహ్యంగా ఉంటాడు. ఇక అలాంటి ఆ రౌడీ హీరో అవుతాను అనడంలో అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు. వాళ్లు అలా నవ్వడం చూసిన ఆ రౌడీ వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలి అంటే తను హీరో అవ్వాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి తనను పెట్టి సినిమా తీసే డైరెక్టర్ కోసం వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎస్ జే సూర్య అతనికి దొరుకుతాడు.

సినిమా అంటే ఫ్యాషన్ గా ఉండే ఎస్ జే సూర్య ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా తీసి తను ఒక పెద్ద డైరెక్టర్ గా గుర్తింపు పొందాలి అనుకుంటారు. కానీ అదే సమయంలో ఈ రౌడీతో సినిమా చేయమని ఎస్ జె సూర్య ఫోర్స్ చేస్తూ ఉంటారు. మొదట్లో రౌడీతో సినిమా చేయడానికి అతను ఒప్పుకోనప్పటికీ ఆ తర్వాత రౌడీతో సినిమా చేస్తే అది కొత్త రకమైన ఎక్స్పరిమెంట్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఒప్పుకోవడం జరుగుతుంది. ఇక అప్పటి నుంచి సూర్య, లారెన్స్ ని పెట్టి సినిమా తీయడానికి ఎలాంటి కథను ఎంచుకోవాలి అనే కథాంశం మీదనే ఈ కథ నడుస్తూ ఉంటుంది.

ప్లస్ పాయింట్స్ :

లారెన్స్
ఎస్ జె సూర్య

మైనస్ పాయింట్స్ :

కథ
సీన్స్ లాగ్ అయ్యాయి
సాంగ్స్

రేటింగ్‌ 2/5

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading