Home » ఝ‌ల‌న్ గోస్వామి రికార్డు.. ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌

ఝ‌ల‌న్ గోస్వామి రికార్డు.. ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌

by Anji
Ad

ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త‌ మ‌హిళ‌ల జ‌ట్టు వెస్టిండిస్‌పై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో ప‌లు రికార్డులు న‌మోదు అయ్యాయి. ముఖ్యంగా త‌న 22 ఏళ్ల కెరీర్‌లో అరుదైన మైలురాయిని అధిగ‌మించింది టీమిండియా సీనియ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ ఝ‌లన్ గోస్వామి. ఐసీసీ మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్‌లో అత్య‌ధిక వికెట్లు సాధించిన క్రికెట‌ర్‌గా రికార్డు నెల‌కొల్పింది. 40 వికెట్ల‌తో ఆస్ట్రేలియా కు చెందిన లినెట్ పుల్‌స్టోన్‌ను (39 వికెట్లు) వెన‌క్కి నెట్టేసి ఈ జాబితాలో అగ్ర‌స్థానానికి చేరుకున్న‌ది.మార్చి 12, 2022న వెస్టిండిస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఒక వికెట్‌తో ఈ ఘ‌న‌త ద‌క్కించుకున్న‌ది. ఝ‌ల‌న్ గోస్వామి. 39 ఏళ్ల గోస్వామి. 2005 నుంచి ఐదు ప్ర‌పంచ‌క‌ప్‌లలో ఆడింది. ఇక ఈ మ్యాచ్‌లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసి ప్ర‌పంచ‌క‌ప్ టైటిల్ పోటీలో నిలిచింది టీమిండియా.

Advertisement

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోండి

Advertisement

 

స్మృతి మంధాన‌, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ అద్భుత శ‌త‌కాల‌తో విండిస్ పై 155 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. వారిని ప్ర‌శంసిస్తూ.. మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. పురుషుల క్రికెట్‌లో జెర్సీ నెం.7 (ఎం.ఎస్‌.ధోనీ), జెర్సీ నెం.18 (విరాట్ కోహ్లీ) బౌల‌ర్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఇప్పుడు స్మృతి, కౌర్ అద్భుతంగా ఆడారు అని సెహ్వాగ్ ప్ర‌శంసించాడు.

 

Visitors Are Also Reading