Telugu News » ‘జెర్సీ’ హీరోయిన్ కి క‌రోనా పాజిటివ్‌..!

‘జెర్సీ’ హీరోయిన్ కి క‌రోనా పాజిటివ్‌..!

by Bunty

రోజు రోజుకు క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇక చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా చాప‌కింద నీరులా పాకుతొంది. ఇప్ప‌టికే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కు ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా బారీన ప‌డ్డారు. తాజాగా మ‌రో స్టార్ హీరోయిన్ క‌రోనా బారీన ప‌డింది. బాలీవుడ్‌లో రీమెక్ అవుతున్న జెర్సీ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తున్న మృణాల్ ఠాకూర్ కరోనా బారిన ప‌డింది.

Ads

అయితే బాలీవుడ్ న‌టీ మృణాల్ ఠాకూర్‌కు కరోనా పాజిటివ్ సోకింద‌ని ఆమె శ‌నివారం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్ల‌డించింది. ఆమెకు తేలిక‌పాటి ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో.. వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోగా.. కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్న‌ద‌ని పేర్కొన్న‌ది. నేను ఒంట‌రిగానే ఉన్నాను. నేను నా డాక్ట‌ర్, ఆరోగ్య‌నిపుణులు ఇచ్చిన ప్రోటోకాల్‌ను పాటిస్తున్నాన‌ని ఆమె త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. నాతో కాంటాక్ట్‌లో ఉన్న వారంద‌రూ ద‌య‌చేసి వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించింది. అంద‌రూ ఆరోగ్యంగా, సుర‌క్షితంగా ఉండాల‌ని మృణాల్ ఠాకూర్ కోరారు.


You may also like