Home » స్వీట్ చ‌ట్నీతో జిలేబీ చాట్‌.. !

స్వీట్ చ‌ట్నీతో జిలేబీ చాట్‌.. !

by Anji
Ad

సోష‌ల్ మీడియా వినియోగం పెరిగిన త‌రువాత నిత్యం ప‌లు ర‌కాల వీడియోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక వీటిల్లో ఫుడ్ వీడియోలు బాగా పాపుల‌ర్ అవుతున్నాయి. లాక్‌డౌన్ స‌మ‌యం నుంచి కొంత మంది వ్యక్తులు త‌మ‌లో ఉన్న టాలెంట్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా చూపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా కొత్త వంటకాలు త‌యారు చేస్తూ వింత పేర్ల‌తో సోష‌ల్ మీడియానే షేక్ చేస్తూ ఉన్నారు. మొన్న‌టికి మొన్న ఒరియో బిస్కెట్లతో ఓ వ్య‌క్తి బ‌జ్జీలు వేస్తే.. ఆ త‌రువాత పానీ పూరీల‌తో ఐస్‌క్రీమ్, మ్యాగీతో ష‌ర‌బ‌త్ అని చెప్పి వ్యూయ‌ర్స్‌కు షాక్ ఇచ్చాడు.

Viral Video: ఇదేంది సామీ.! స్వీట్ చట్నీతో జిలేబీ చాట్.. పేకాటాడేస్తున్న నెటిజన్లు.. వైరల్ వీడియో!

Advertisement

Advertisement

ఇక ఇప్పుడు మ‌రొక వెరైటీ రెసిపీతో స్ట్రీట్ ఫుడ్ విక్రేత వింత ప్ర‌యోగం చేసాడు. దానిని చూసి నెటిజ‌న్లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. జిలేబీలు అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రుంటారు చెప్పండి. అంద‌రికీ ఇదంతా చాలా ఇష్టంగా ఉంటుంది. అలాంటి జిలేబీతో ఏకంగా స్పైసీ చాట్ చేశాడు. ఓ స్ట్రీట్ ఫుడ్ విక్రేత అత‌డు ముందుగా ఓ ప్లేట్లో జిలేబీలు తీసుకుని దానిపై పాప‌డ్ వేసి కొంచెం గ‌రం మ‌సాలా, స్వీట్ చ‌ట్నీ, ఉల్లిపాయ‌, సాస్, పెరుగు, మిక్చ‌ర్, దానిమ్మ గింజ‌ల‌తో పాటు క్ష‌ణాల్లో స్పైసీగా చాట్ చేసాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా.. నెటిజ‌న్లు అత‌న్ని తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు.

Visitors Are Also Reading