జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ ఇద్దరూ ఎంతో పేరొందిన ప్రభత్వ అధికారులు, ఇద్దరూ రాజకీయాల్లోకి ప్రవేశం కూడా చేశారు. జేపీ లోక్‌సత్తా పార్టీ స్ఠాపించి 2009 ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందగా.. ఆ తరువాత రాజకీయాల్లో రాణించలేకపోయాడు. అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి 2019 ఏపీ ఎన్నికల్లో విశాఖపట్టణం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందాడు. ఇక ఆ తర్వాత 2020లో జనసేన పార్టీకి రాజీనామా చేశాడు. వీరిద్దరూ సమర్థవంతమైన అధికారులుగా పేరుపొందిన వారు కానీ రాజకీయాల్లో ఇరువురు ఎదగలేకపోయారు.
Advertisement
ముఖ్యంగా రాజకీయాల్లో రాణించాలంటే ట్రిక్కులు తెలియాలి. ఎత్తుకు పై ఎత్తు తెలిస్తే కానీ రాజకీయాల్లో రాణిస్తారు. ఏదో ఒక రంగంలో గుర్తింపు ఉంటేనే నేటి తరుణంలో రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అనేవిధంగా రాజకీయాల్లో మెలగాలి. ఈ రెండు వీళ్లకు రావు. ఉన్నది చదువులో, ఉద్యోగంలో నేర్చుకున్న నీతి, నిజాయితీలకు రాజకీయాలకు అసలు పొంతన ఉండదు. జేపీ నారాయణ లోక్‌సత్తా పార్టీని నడిపించాలంటే డబ్బులు కావాలి. కానీ ఆయన వద్ద డబ్బలు లేవు. ఇక పోనీ పీవీ నరసింహారావు లాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుందామనుకుంటే మానవతా విలువలు ఇప్పటి నేతల్లో కనిపించడం లేదు.
Advertisement
ప్రస్తుత పరిస్థితిల్లో రాజకీయాల్లో రాణించాలంటే అధికారం, పదవులు, పరమావధిగా అడ్డదిడ్డంగా రాజకీయాలు చేయగలగాలి. వెన్నుపోట్లు, ముందుపోట్లు పొడవగలిగితేనే.. రాజకీయాల్లో రాణిస్తారు. కేవలం అవినీతి నిర్మూలన అజెండా ఉంటే మాత్రం అధికారం రాదని అర్థమైంది. 1977లో దేశవ్యాప్తంగా జనతా పార్టీ గెలిచినప్పటికీ.. 1983లో టీడీపీ ప్రభంజనం సృష్టించినా.. 1989లో తిరిగి కాంగ్రెస్ విజయం సాధించినా ప్రజలు విసుగు చెంది ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసారు. కొత్తగా వచ్చిన వారిని గెలిపించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా అదే జరిగింది. కాంగ్రెస్, బీజేపీలపై విసుగు చెందిన సమయంలోనే ఆమ్ ఆద్మీ పేరుతో అరవింద్ క్రేజీవాల్ పదవీ అదృష్టం వరించింది. ఈ పరిస్థితులు జేపీ, జేడీ లక్ష్మీనారాయణలకు లభించకపోవడంతో వారు విజేతలుగా నిలువలేకపోతున్నారు.
మన ప్రజలకు సమర్థులైన నాయకుల విలువ తెలియదు. తాత్కాలిక ప్రయోజనాలతో మభ్యపెట్టే మాయగాళ్లు చెప్పే మాటలు విని బిర్యాని ప్యాకెట్, సారా ఫ్యాకెట్‌లు ఎవరు ఇస్తే వారికి ఓట్ల వేస్తారు. ఓటర్లు ఆర్థికంగా విద్యాపరంగా ఇలాంటి నాయకుల ఆటలు సాగవు. ముఖ్యంగా ఈ రోజుల్లో రాజకీయాల్లో ఎవరు గెలవాలనుకున్న డబ్బుతోనే ముడిపడి ఉంది. పేరు, నిజాయితి కేవలం 20 శాతం మాత్రమే ఉపయోగపడుతుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా ఖర్చు పెడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయం ఓ వ్యాపారంగా తయారైపోయింది. ఉద్యోగస్తులు కానీ స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలనే వాళ్లు కానీ ఇలాంటి వ్యాపార రాజకీయాల్లో రాణించాలంటే ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలి. లేదంటే ఎప్పటికీ ఇదేవిదంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి వారికి ఓటు వేస్తారో వేచి చూడాలి.
Also Read :
ఇంట్లో ఏ దేవుళ్ల ఫోటోలుండాలి..? ఏ దేవుళ్ల ఫోటోలు ఉండకూడదో తెలుసా..?
ఆర్ఆర్ఆర్ మూవీలో ఈ చిన్న లాజిక్ మీరు గుర్తించాలి.. ఆ జెండాలో ఏం..?