Home » ఆసక్తి రేపుతున్న జయం రవి సైరెన్ టీజర్.. ఈ సారి సక్సెస్ గ్యారెంటీ ?

ఆసక్తి రేపుతున్న జయం రవి సైరెన్ టీజర్.. ఈ సారి సక్సెస్ గ్యారెంటీ ?

by Anji

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్ సినిమాల ద్వారా ఇక్కడ పాపులర్ అయ్యి తన సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ పొన్నియన్ సెల్వన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన జయం రవి ఈ ఏడాది ఇరైవన్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించగా, ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. తమిళ్ డైరెక్టర్ ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటించిన కొత్త సైరెన్ 108. ఈ సినిమా టీజర్ కాసేపటికి కిందటే రిలీజ్ చేయడం జరిగింది.

ఇక సైరన్ 108 టీజర్ ని తెలుగులో దిల్ రాజు లాంచ్ చేయడం జరిగింది. ఇక టీజర్ ని చూశాక కథ నేపథ్యంలో మేకర్స్ ఆల్మోస్ట్ క్లారిటీ ఇచ్చారని తెలుస్తుంది. ఇక సినిమాలో అన్యాయంగా జైలుకి వచ్చిన ఓ వ్యక్తి తాను జైలు నుండి యావజ్జీవ శిక్ష అనుభవించిన తర్వాత బయటికి వచ్చి ఏం చేశాడనేది సినిమా కథగా చూపిస్తున్నాడని తెలుస్తుంది. ఇక టీజర్ లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల తో పాటు, పలు ఆక్షన్ సన్నివేశాలని చూపించారు.

ఇక టీజర్ లో జయం రవి లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. కీర్తి సురేష్ హీరోని పట్టుకునే జైలర్ అధికారిగా కీలక పాత్రలో నటించిందని తెలుస్తుంది. ఇక తమిళ్ సినిమా అయినా, అక్కడక్కడ అజయ్, తులసి లాంటి తెలుగు నటులు కూడా ఉన్నారు. అనుపమ పరమేశ్వరన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక టీజర్ కట్స్ స్టైలిష్ గా ఉండగా, జీవి ప్రకాష్ ఇచ్చిన బీజీఎమ్ యావరేజ్ గా ఉంది. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి. ఇక సైరన్ 108 సినిమా  వచ్చే ఏడాది  ఫిబ్రవరిలో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading