ఐపీఎల్ తర్వాత పర్యటించిన అన్ని దేశాలలో విజయాలతో తిరిగి వచ్చిన భారత జట్టు ఇప్పుడు ఆసియా కప్ కు సిద్ధమవుతుంది. అయితే తాజాగా వెస్టిండీస్ జట్టుకు వారి ఇంట్లోనే 4-1 తేడాతో టీ20 సిరీస్ లో ఓడించింది టీం ఇండియా. అందువల్ల ఆసియా కప్ లో టైటిల్ ఫెవరెట్ గా నిలిచింది. కానీ ఈ ఆసియా కప్ కు ముందు భారత జట్టుకు వరుస షేక్స్ అనేవి తగులుతున్నాయి.
Advertisement
అయితే ఈ విండీస్ పర్యటనలోనే నాలుగో టీ20 తర్వాత భారత యువ పేసర్ హర్షల్ పటేల్ గాయపడినట్లు తేలింది. అందువల్ల అతను ఆసియా కప్ కు అందుబాటులో ఉండకుండా పోయాడు. ఇక ఆ స్థానంలో ఇప్పుడు ఎవరిని జట్టులోకి తీసుకోవాలి అని బీసీసీఐ ఆలోచిస్తుంటే ఇప్పుడు మరో షాక్ అనేది తగిలింది. భారత జట్టు యొక్క ముఖ్యమైన బౌలర్లలో ఒక్కడైనా బుమ్రా కూడా ఆసియా కప్ కు అందుబాటులో ఉండటం లేదు అని తెలుస్తుంది.
Advertisement
అయితే విండీస్ పర్యటన కంటే ముందు వెళ్లిన ఇంగ్లాండ్ పర్యటనలో బుమ్రా గాయ పడ్డాడు. అందుకే ఈ టీ20 సిరీస్ కు అందుబాటులో లేకుండా పోయాడు. కానీ ఇప్పుడు అందుతున్న తాజాగా సమాచారం ప్రకారం బుమ్రా కోలుకోవడానికి ఇంకా మూడు వరాల కంటే ఎక్కువ సమయమే పడుతుంది అని తెలుస్తుంది. అంటే అతను కోలుకొని మళ్ళీ ఫిట్నెస్ నిరూపించుకునే లోపే ఆసియా కప్ అనేది ముగుస్తుంది. కాబట్టి ఈ టోర్నీకి బుమ్రా మిస్ అవుతునార్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :