కామన్‌వెల్త్ క్రీడల్లో భారత రెజర్లు వరుస పతాకాలతో ఆధిపత్యం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగారు పతకం సాధించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. తనను క్షమించండని భారత రెజ్లర్ పూజ గహ్లోత్ వాపోవడం ప్రతీ ఒక్కరినీ కదిలించింది. ఇక దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. ఇది వేడుక చేసుకునే సందర్భం అని, బాధ పడాల్సిన అవసరం లేదని ప్రధాని ట్వీట్ చేశారు. అంతర్జాతీయ క్రీడాకారులను ప్రధాని ప్రోత్సహిస్తుండడంపై పలు దేశాల పౌరులు సోషల్ మీడియాలో ప్రధాని మోడీని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ అంశంపై ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్ మోడీని పొగడ్తలతో ముంచెత్తారు.
Advertisement
ఇక పాకిస్తాన్ నాయకులకు మాత్రం క్రీడలు, క్రీడాకారుల పట్ల నిబద్ధత లేదంటూ విమర్శలు గుప్పించారు పాకిస్తానీ జర్నలిస్ట్. మహిళల 50 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన పూజ గహ్లోత్ క్యాంస్య పతకం సాధించారు. గోల్డ్ మెడల్ సాధించలేకపోయానని బాధపడ్డారు. మీడియా సమావేశంలో పూజ కంటతడి పెట్టారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. పూజ మీరు సాధించిన పతకంతో వేడుకలు జరుపుకోవాలి. మీ జీవిత ప్రయాణం మమ్ముల్ని ఉత్తేజితుల్ని చేయడంతో పాటు మాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చింది. మీరు ముందు ముందు మరిన్ని విజయాలు సాధిస్తారు. ఇలాగే మీ ప్రతిభను కొనసాగించండి అని ప్రధాని ప్రోత్సహించారు.
Ad
This is how India projects their athletes. Pooja Gehlot won bronze and expressed sorrow as she was unable to win the Gold medal, and PM Modi responded to her.
Ever saw such message for Pakistan PM or President? Do they even know that Pakistani athletes are winning medals? #CWG22 https://t.co/kMqKKaju0M— Shiraz Hassan (@ShirazHassan) August 7, 2022
అంతర్జాతీయ పోటీల్లో ఇలా మెరుగైన ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు ప్రధాని మోడీ భరోసా ఇవ్వడం పట్ల పాకిస్తాన్ కి చెందిన షిరాజ్ హాసన్ అనే ఓ జర్నలిస్ట్ ప్రశంసించారు. భారత్ తమ క్రీడాకారులను ఎలా ప్రోత్సహిస్తుందో చూడండి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి, అధ్యక్షుడి నుంచి ఎప్పుడైనా అటువంటి ప్రోత్సహించే మాటలు మనం చూశామా..? కనీసం వారికి పాకిస్తాన్ అథ్లెట్లు పతకాలు గెలుస్తున్నారనే విషయం తెలుసా..? అని సొంత నాయకులపై ప్రశ్నలు గుప్పించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ప్రధాని చెప్పిన మాటలకు సోషల్ మీడియాలో యూజర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది.
Also Read :
అమెజాన్ లో అద్భుతమైన ఆఫర్.. స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ ఆఫర్..!
Advertisement
త్వరలోనే శ్రీజ మూడో పెళ్లి…? సంచలన నిర్ణయం తీసుకున్న మెగాస్టార్….?