ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ 2022లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. మొన్న అర్జెంటీనాను పసికూన సౌదీ అరేబియా ఓడించిన విషయం తెలిసిందే. తాజాగా జర్మనీతో జరిగిన మ్యాచ్ లో 2-1 గోల్స్ తేడాతో జపాన్ అద్భుతమైన విజయం సాధించింది.
Advertisement
మ్యాచ్ తొలి అర్ధభాగంలో జర్మనీ గోల్ కొట్టి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఆ జట్టు ఆటగాడు గుండోగన్ 33వ నిమిషంలో గోల్ చేశాడు. ఆ తరువాత జపాన్ ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకున్నారు. స్వల్ప వ్యవధిలో రెండుగోల్స్ చేయడమే కాక జర్మనీకి మరో గోల్ కొట్టే అవకాశమివ్వలేదు. జపాన్ తరుపున రిస్తో డోన్ 75వ నిమిషంలో టకుమా అసానో 83వ నిమిషంలో గోల్స్ చేశారు. దీంతో జర్మనీపై 2-1 తేడాతో జపాన్ విజయం సాధించి సంచలనం నమోదు చేసింది. మరోవైపు ప్రాన్స్ ఆటగాళ్ల దూకుడు ముందు నిలవలేకపోయిన ఆస్ట్రేలియా వరుస గోల్స్ సమర్పించుకుని ఓటమి పాలైంది. మొరాకో-క్రొయోషియా మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Advertisement
Also Read : పడిపోయిన బాబర్ ఆజమ్.. నెంబర్ వన్ లోనే టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్..!
మొదటి అర్థభాగంలో ఆధిక్యంలో ఉన్న జర్మనీ మ్యాచ్ ఓడిపోవడం 1978 తరువాత ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ ముందు వరకు వారు 21 మ్యాచ్ లలో ఓటమిలేకుండా అజేయంగా ఉన్నారు. గేమ్ లో వెనుకబడి గెలవడం జపాన్ కి ఇది తొలిసారి. ఈ మ్యాచ్ ముందు వరకు వారి ఆడిన 13 మ్యాచ్ లలో రెండు డ్రా కాగా.. 11 మ్యాచ్ లలో ఓడిపోయింది. జర్మనీ జట్టు మొదటి 18 ప్రపంచ కప్ టోర్నమెంట్ లలో కేవలం ఒక దానిలో మాత్రమే తమ తొలి గేమ్ ఓడిపోయింది. గత 2 ప్రపంచ కప్ లలో ప్రతీ దాంట్లో తొలి మ్యాచ్ ని కోల్పోయింది. ఒకే ప్రపంచకప్ లో ఇద్దరూ సబ్ స్టిట్యూట్ లు రిట్స్ డోన్, టకుమా అసనో గోల్స్ చేసిన జట్టుగా జపాన్ నిలవడం విశేషం.
Also Read : ఫిఫా ప్రపంచ కప్ లో అతి పెద్ద సంచలనం.. 36 విజయాల రికార్డుకి చెక్..!