Home » Japan Movie Review : జపాన్ రివ్యూ..కార్తీ ఇరగదీశాడుగా !

Japan Movie Review : జపాన్ రివ్యూ..కార్తీ ఇరగదీశాడుగా !

by Bunty
Ad

 

Japan Movie Review : జపాన్ సినిమాలో కార్తీ, అను ఇమ్మానుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు నటించారు. రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ప్రభు ఈ సినిమాని నిర్మించారు. జీవి ప్రకాష్ సంగీతాన్ని అందించారు. ఇక జపాన్ టైలర్ ని చూస్తే చాలా కొత్తగా ఉంది. ఈ మూవీ కథ బాగా సింపుల్ గా ఉన్నట్టు ఉంది. దాని సెటప్, నేపథ్యంలో మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇక ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమా రివ్యూ ఒకసారి చూద్దాం.

Japan Movie Review

కథ మరియు వివరణ :
కార్తి హీరోగా చేసిన జపాన్ సినిమా కథ విషయానికి వస్తే జపాన్ (కార్తీ) చిన్నప్పటి నుంచి పొట్టకూటి కోసం చిన్నచిన్న దొంగతనాలు చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతాడు. ఇక అలా దొంగగా మారిన జపాన్ తన కెరీర్ లో చాలా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే ఆయనకి ఒక బిగ్ డీల్ అనేది దొరుకుతుంది. అది ఏంటి అంటే…. మినిస్టర్ ఇంట్లో డబ్బులు కొట్టేయాలి అనే ఒక డీల్ కుదురుతుంది. ఇక ఆ డీల్ ని అంగీకరించిన జపాన్ మంత్రి ఇంట్లో దొంగతనం చేస్తాడు. సరిగ్గా అదే సమయానికి ఆ ఇంట్లో ఒక మ***ర్డర్ జరుగుతుంది.

Advertisement

Advertisement

ఈ మ***ర్డర్ చేసింది జపాన్ అని అనుకున్న పోలీసులు జపాన్ కోసం వెతకడం మొదలుపెడతారు. అయితే ఈ దొంగతనం చేయడానికి, ఆ మ***ర్డర్ కి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు. కావాలనే ఆ మ***ర్డర్ లో జపాన్ ని ఇరికించారా అనేది తెలియాలి అంటే థియేటర్ కు వెళ్లాల్సిందే. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుందని…. కార్తి తన పాత్రలో అద్భుతంగా నటించాడని అంటున్నారు. సెకండ్ హాఫ్ సూపర్ అని….జీవి ప్రకాష్ అందించిన బిజీఎం నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజువల్స్ పరంగా సినిమా అదుర్స్ అంటున్నారు. అలాగే ఇందులో కార్తీ, అను కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తోందని అంటున్నారు.

ప్లస్ పాయింట్స్ :
కార్తీ నటన
కామెడీ
స్క్రీన్ ప్లే
డైరెక్షన్

మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
మ్యూజిక్
సాగదీత

రేటింగ్ : 2.5/5

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading