ఈ మధ్యే కాలంలో బాలీవుడ్ లో మన తెలుగు హీరోలు రాజ్యం ఏలుతున్నారు అనేది తెలిసిందే. సౌత్ నుండి ఎక్కువగా మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో విడుదల అవుతున్నాయి. సూపర్ హిట్స్ అందుకొని కలెక్షన్స్ కొల్లగొడుతున్నావు. దాంతో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ కు మన తెలుగు హీరోలు అంటే ఓ పిచ్చి అనేది ఏర్పడుతుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అలాంటి కామెంట్స్ చేసింది.
Advertisement
అయితే జాన్వీ కపూర్ గతంలో తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అని చాలాసార్లు చెప్పింది. కానీ ఇప్పుడు మరో తెలుగు హీరో గురించి ఈ అమ్మడు మాట్లాడింది. ఈ మధ్యే మన ఆర్ఆర్ఆర్ అనే సినిమా బాలీవుడ్ లో దుమ్ము లేపిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు హీరోలుగా నటించారు. అయితే ఇప్పుడు ఇందులో ఒక్కరియాన్ ఎన్టీఆర్ గురించే జాన్వీ కపూర్ మాట్లాడింది.
Advertisement
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నాకు ఎప్పటి నుండో ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయాలనీ ఉంది. తనతో నటించడం నా డ్రీమ్ అంటూ కామెంట్స్ చేసింది. ఇక ప్రస్తుతం జాన్వీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడా జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లో చేస్తుంది… ఎన్టీఆర్ తో నటిస్తుంది అనే వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజంలేదు అని తెలిసిపోయింది.
ఇవి కూడా చదవండి :