Home » Janhvi Kapoor : పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్ జాన్వీ కపూర్.. వరుడు ఎవరంటే ?

Janhvi Kapoor : పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్ జాన్వీ కపూర్.. వరుడు ఎవరంటే ?

by Bunty
Ad

 

 

ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంతమందికి మాత్రమే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కానీ కొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. మరికొంతమంది మాత్రం తమ కుటుంబానికి సంబంధించిన బ్యాగ్రౌండ్ ఉపయోగించుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలా కుటుంబ నేపథ్యం ఉపయోగించుకొని ఇండస్ట్రీలో రాణిస్తోంది జాన్వీ కపూర్.


హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ త్వరలోనే తెలుగులో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట జాన్వీ కపూర్.

Advertisement

ఇది ఇలా ఉండగా తాజాగా హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన చిన్ననాటి బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా తో జాన్వీ కపూర్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. చాలాసార్లు వీరు కలిసి తిరిగేటప్పుడు కెమెరాలకు కూడా చిక్కారు. అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయట. దీంతో వచ్చే ఏప్రిల్ మాసంలో జాన్వీ కపూర్ పెళ్లి చేయాలని శ్రీదేవి కుటుంబం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading