శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వి కపూర్ బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో మిలియన్స్ కొద్ది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఇప్పటివరకు జాన్వీకి సరైన హిట్ పడలేదు. కానీ క్రేజ్ మాత్రం చాలానే ఉంది. జాన్వి కపూర్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఇప్పటికే పరిచయమైనప్పటికీ.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.
READ ALSO :ఓటీటీలో వినరో భాగ్యము విష్ణు కథ స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎక్కడ అంటే..?
Advertisement
ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే జాన్వి ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో ఆమె డేటింగ్ చేస్తుందంటూ బిటౌన్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు స్పందించని ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి ప్రియుడితో కనిపించింది.
బాయ్ ఫ్రెండ్ షికర్ పహారియాతో కలిసి ముంబైలోని కాలినా ఎయిర్పోర్టులో దర్శనమిచ్చింది. ఇద్దరు వైట్ డ్రెస్ లో ట్వినింగ్ అవుట్ ఫిట్ లో కనిపించారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఇద్దరు వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో పార్టీలకు కలిసి హాజరైన జాన్వి, శిఖర్ లు ఇప్పటివరకు తమ రిలేషన్ షిప్ పై అధికారికంగా ప్రకటించలేదు.
READ ALSO : TS Constable : ఏప్రిల్ 2న పోలీస్ కానిస్టేబుల్ తుది రాతపరీక్ష..కచ్చితంగా ఈ రూల్స్ పాటించండి